Nidhhi Agerwal: ప్రతి దానిలో మంచి చెడు ఉన్నట్లు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ప్రపంచం అలానే తయారయింది. సోషల్ మీడియాని యూస్ చేసుకొని కొంతమంది సెలబ్రిటీ అవుతున్నారు. అలానే ఇంకొంతమంది తెలుగు సినిమా పరిశ్రమలో నటులుగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించడం రాక ఇంకొంతమంది జైలు పాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక ప్రస్తుతం గత రెండు రోజులుగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక ప్రభుత్వ వాహనంలో ఈవెంట్ కు హాజరైంది. దీనిపై నిధి అగర్వాల్ మీద విపరీతమైన స్ట్రోల్స్ వచ్చాయి. దానికి సమాధానం కూడా చెప్పింది నిధి అగర్వాల్. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో ఈమె కీలక పాత్రలో కనిపించడంతో కొంతమంది టార్గెట్ గా ఈమెను ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు.
ఓపెన్ అయిన నిధి అగర్వాల్
మొత్తానికి ఆల్రెడీ ప్రభుత్వ వాహనం గురించి నిధి అగర్వాల్ ఒక లెటర్ నోట్ విడుదల చేసింది. అయినా కూడా ఆమె మీద ట్రోలింగ్ తగ్గలేదు. ఇక ప్రస్తుతం ట్విట్టర్ ఎలా పనిచేస్తుందో తాను ట్విట్టర్ వేదికగా ట్వీట్ వేసింది. ట్విట్టర్లో ఫస్ట్ నెగెటివిటీ క్రియేట్ చేస్తారు. ఆ నెగెటివిటీ వలన రీచ్ వస్తుంది. ఆ రీచ్ వలన డబ్బులు వస్తాయి. మొత్తానికి ఇదంతా కూడా డబ్బు కోసమే జరుగుతుంది. కాబట్టి నా ట్విట్టర్ ఫ్యామిలీకి నేను చెప్పాలనుకుంటున్నాను మీరు చాలా స్మార్ట్ గా ఉండండి. ఏది ఆర్గానిక్ ట్వీట్, ఏది పెయిడ్ ట్వీట్, ఆ ట్వీట్ ను ఏ అజెండాతో వేశారు గుర్తించగలగాలి. అలానే ప్రేక్షకులు మరియు అభిమానులు ట్విట్టర్ ఇన్ఫర్మేషన్ కి వెనకాల ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది.
How twitter works —> negativity —> reach —> money
I want to tell my twitter family.. please be smart, learn how to decode what is organic, what is paid and what is done with an agenda.
But one thing is real audience and fans are beyond “twitter info”
God bless
Love and light…— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 13, 2025
భారీ ప్రాజెక్టులు
ఇక ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ ప్రాజెక్టు తర్వాత నిధి అగర్వాల్ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తుంది నిధి అగర్వాల్. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా అగ్రిమెంట్ చేసినప్పుడు మరో సినిమాకి సైన్ చేయకూడదు అని కండిషన్ తీసుకుందట. అయితే ప్రభాస్ హీరోగా అవకాశం రావడంతో నిర్మాతల పర్మిషన్ తీసుకొని మరి ఈ సినిమాలో యాక్ట్ చేసింది నిధి అగర్వాల్.
ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే, చాలా రోజులు తర్వాత ప్రభాస్ లోని ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను మారుతి బయటకు తీశాడు అనిపిస్తుంది. ఇదివరకే వచ్చిన టీజర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read: Sandeep Reddy Vanga: ఇక్కడికంటే అక్కడ సినిమా తీయడం చాలా ఈజీ