BigTV English

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump, Putin Meeting: ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్‌, పుతిన్‌ల సమావేశం ముగిసింది. అమెరికాలోని అలస్కా ఈ కీలక భేటికి వేదికైంది. దాదాపు రెండున్నర గంటలపైగా మీటింగ్ సాగింది. భేటీ తర్వాత మీడియా ఎదుట ఇరువురు నేతలు వివరాలు తెలిపారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు రష్యా అధ్యక్షులు పుతిన్‌. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు.


ట్రంప్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి-పుతిన్
ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని చెప్పారు. ఉక్రెయిన్‌ ప్రధాన అంశంగా చర్చించినట్లు పుతిన్‌ పేర్కొన్నారు. మరోసారి భేటీ కావాలని ట్రంప్‌-పుతిన్‌ నిర్ణయించారు. తదుపరి సమావేశం కోసం మాస్కోకు రావాలని ట్రంప్‌ను పుతిన్‌ ఆహ్వానించారు.

జెలెన్‌స్కీ, ఈయూతో త్వరలో చర్చిస్తా -ట్రంప్
చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. చాలా అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్నివిషయాల్లో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కాదని తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు.


Also Read: శత్రువుల గుండెలు అదిరేలా.. భారత్ గేమ్ ఛేంజర్.. మిషన్ సుదర్శన చక్ర ఎలా పని చేస్తుందంటే?

చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఈయూకు పుతిన్ వార్నింగ్
అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్‌ లావ్రోవ్‌, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్‌ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. అంతకు ముందు ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్‌ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. వీరిద్దరి సమావేశాన్ని ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా చూశాయి.

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×