E-Paper
Advertisement

‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!

‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!
Advertisement

Mega 158:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన తాజాగా ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి(Bobby kolli) దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆరోజు అదిరిపోయే గుడ్ న్యూస్ అభిమానులకు అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆరోజు విడుదల చేసే టీజర్ లో ఊహించని సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

చిరంజీవి – బాబీ చిత్రం టైటిల్ రిలీజ్ డేట్ లాక్..

బెంగాల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాబీ కొల్లి (Bobby kolli) చిరంజీవిని ఈసారి కొత్తగా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ రోజు విడుదల చేసే టీజర్ లో చిత్ర టైటిల్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ డేట్ ను కూడా ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 22వ తేదీన విడుదల చేసే బర్తడే స్పెషల్ టీజర్ లో ఈ విషయాలను వెల్లడించి, వినాయక చవితి సందర్భంగా టైటిల్ రిలీజ్ చేస్తారేమో చూడాలి అంటూ నెటిజన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మరొకవైపు ఈ సినిమాకి ‘కాకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

మెగా 158 సినిమా విశేషాలు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తుండగా.. నివేదా పేతురాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా ఈ ప్రొడక్షన్ హౌస్ కి మెగాస్టార్ చిరంజీవి తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇప్పటికే 45 రోజుల షూటింగ్ పూర్తికాగా.. మొదటి భాగం ఎడిటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2027 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్గా మేకర్స్ పెట్టుకున్నారు. ఇకపోతే ఇన్ని రోజులు ఈ చిత్రానికి కదిరి అని టైటిల్ పెట్టబోతున్నారు అంటూ బలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో టైటిల్ వెలుగు చూస్తోంది. అటు చిరంజీవి కూడా టంగ్ స్లిప్ అయినట్లు వార్తలు వినిపించాయి. మరి ఈ సినిమా టైటిల్ అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

also read:సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఇరుముడి’.. రన్ టైమ్ లాక్!

మెగాస్టార్ చిరంజీవి మూవీకి పోటీగా ఇన్ని సినిమాలా?

Advertisement

సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ చిత్రానికి ఏకంగా చాలా సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమా సంక్రాంతి బరిలో దిగడానికి ఫిక్స్ అయిపోయింది. అలాగే శ్రీ విష్ణు – రవితేజ కాంబో మూవీ, శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబో మూవీ, ప్రశాంత్ వర్మ మహాకాళితో పాటు సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాలు కూడా ఉన్నాయి . మరి ఈ చిత్రాలలో ఏ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందో చూడాలి.

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×