E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఇరుముడి’.. రన్ టైమ్ లాక్!

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఇరుముడి’.. రన్ టైమ్ లాక్!
Advertisement

Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ (Raviteja ) సరైన సక్సెస్ కోసం ఇప్పుడు ఏకంగా జానర్ మార్చేశారు. ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, క్రైమ్ డివోషనల్ నేపథ్యంలో ఇరుముడి అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రేమ కథలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న శివ నిర్వాణ (Siva nirvana) ఇప్పుడు క్రైమ్ యాక్షన్ తో మరోసారి మెప్పించడానికి సిద్ధం అయ్యారు. ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఇటు విడుదల తేదీకి దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా కాపీని మేకర్స్ సెన్సార్ కి పంపించగా.. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ఫుల్ పాజిటివ్ రివ్యూ తో సర్టిఫికెట్ అందించారు. మరి సెన్సార్ పూర్తి చేసుకున్న ఇరుముడి సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ లభించింది? దీని రన్ టైం ఎంత? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ఇరుముడి మూవీ..

మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్ గా, బేబీ నక్షత్ర ( Baby Nakshatra) ప్రధాన పాత్రలో ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం ఇరుముడి ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మొత్తం 2 గంటల 25 నిమిషాల రన్ టైం ను మేకర్స్ లాక్ చేశారు. పైగా ఈ సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ లభించినట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రవితేజ మళ్ళీ గట్టి కం బ్యాక్ ఇస్తారని చెప్పవచ్చు.

Advertisement

also read:కోర్టు చుట్టూ తిరుగుతున్న పల్లవి ప్రశాంత్.. రెండేళ్లయినా ఆగని తిప్పలు!

తండ్రీ – కూతుళ్ల సెంటిమెంటే ప్రధాన హైలెట్..

ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని తండ్రీ కూతుళ్ల సెంటిమెంటు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుంది అని, దీనికి తోడు క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. కథానాయకుడి పాత్ర అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత అతనిలో కలిగిన మార్పులు, క్యారెక్టర్ లో వచ్చే మార్పులు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి అని సమాచారం.

రూమర్స్ పై చిత్ర బృందం క్లారిటీ..

Advertisement

ఈ సినిమా నుండి అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి పాటలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రధాన పిల్లర్ గా నిలవనుంది అని సమాచారం. మరొకవైపు ఈ చిత్రంలోని మల్లెపూల పల్లకి పాటలో రామ్ చరణ్ క్యామియో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ వార్తలలో నిజం లేదని అటు రామ్ చరణ్ టీం తో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ కూడా స్పష్టం చేశారు. మరి ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్

దేవా మళ్లీ దిగుతున్నాడట.. సలార్ 2పై ఇంట్రెస్టింగ్ న్యూస్

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. పుట్టిన తేదీ కూడా తప్పు: వేణు స్వామి

ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!

మ్యూజిక్ పై ఏఐ ప్రభావం.. ఆ కష్టం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ!

పెళ్లికి సిద్ధమైన కావ్య – అనిరుధ్!

Big Stories

Advertisement
×