BigTV English

Fish Bone: మహిళ గొంతు చీల్చుకుని బయటకు వచ్చిన చేప ముల్లు, చివరికి..

Fish Bone: మహిళ గొంతు చీల్చుకుని బయటకు వచ్చిన చేప ముల్లు, చివరికి..

చేపల కూర తినడం ఒక ఆర్ట్. అందులోనూ ముళ్లు ఎక్కువగా ఉన్న చేపల్ని మరింత జాగ్రత్తగా తినాలి. ముల్లు తీయడం రాదని చాలామంది చేపల కూరని దూరం పెడతారు. ఎవరైనా ముల్లు తీసిచ్చేవారు దొరికితేనే దాన్ని ఇష్టంగా తింటారు. మన ఇళ్లలో కూడా పెద్దవాళ్లు జాగ్రత్తగా ముల్లు వలిచి పిల్లలకు పెడుతుంటారు. ఒకటికి రెండుసార్లు ముల్లు ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు. ఒకవేళ అజాగ్రత్తతో ముల్లు గొంతులోపలికి వెళ్తే ఏం చేయాలి..? వెంటనే ఒక అన్నం ముద్దను మింగేయాలని, ఎక్కువగా నీరు తాగాలనేది పెద్దవాళ్లు చెప్పే సలహా. అప్పటికి కూడా ముల్లు లోపలికి వెళ్లకపోతే డాక్టర్ ని సంప్రదించాల్సిందే. అయితే ఇలా నోటిలో ముల్లు ఇరుక్కుందని డాక్టర్ల వద్దకు వెళ్లేవారి సంఖ్య చాలా అరుదు. కానీ థాయిల్యాండ్ లో జరిగిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముల్లుని తీయకుండా చేపను తిన్న ఓ మహిళ చివరకు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేసి ఆ ముల్లు తీసేశారు డాక్టర్లు. ప్రాణాపాయం నుంచి బతికి బయటపడింది ఆ మహిళ.


ఆమె వయసు 45 ఏళ్లు. భర్త చేపలు తీసుకుని రావడంతో ఎంచక్కా కూర చేసింది. అందరూ తిన్న తర్వాత ఆమె కూడా కూరవేసుకుని తిన్నది. అయితే అది ముళ్లు ఎక్కువగా ఉన్న చేప కావడంతో ఆమె ఇబ్బంది పడింది. పొరపాటున ఓ పెద్ద ముల్లు ఆమె గొంతులోకి వెళ్లింది. నొప్పితో అల్లాడిపోయిన ఆ మహిళ తన భర్తకు విషయం చెప్పింది. ఇరుగు పొరుగు వారు వచ్చి సపర్యలు చేశారు. వారికి తోచింది చెప్పి చూశారు. చేపల కూర లేకుండా ఇతర ఆహార పదార్థాలను తినాలని సూచించారు. అలానే చేసింది, అయినా చేప ముల్లు గొంతులోనుంచి లోపలికి వెళ్లలేదు. గొంతు లోపలికి వేళ్లు పెట్టి ముల్లు తీయాలని చూశారు, ఫలితం లేదు. లీటర్ల కొద్దీ నీరు తాగింది, అయినా ప్రయోజనం లేదు. దీంతో చివరికి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రిలో కూడా ఆమెకు ఫలితం దక్కలేదు. రెండుసార్లు ఎక్స్-రేలు తీశారు కానీ ముల్లుని గుర్తించలేకపోయారు. ముల్లు లేదు, అది మీ భ్రమ అని చెప్పి పంపించేశారు. చేసేదేం లేక ఇంటికొచ్చింది ఆ మహిళ. అయినా కూడా గొంతులో నొప్పి తగ్గలేదు. ముల్లు గుచ్చేస్తున్నట్టుగా ఉంది. అలానే రెండు వారాలు ఇబ్బంది పడింది. ఆ తర్వాత ముల్లు గొంతుని చీల్చుకుని బయటకు వచ్చింది. సహజంగా ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. చేపలు తిన్న రెండు వారాల తర్వాత ముల్లు బయటకు కనపడటం, అది కూడా గొంతుని చీల్చుకుని రావడంతో వారు షాకయ్యారు. ఆమెను మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈసారి డాక్టర్ పర్ఫెక్ట్ గా ఎక్స్ రే తీసి ముల్లుని గుర్తించారు. జాగ్రత్తగా మెడ దగ్గర ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.


తన భార్య ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడిందనే విషయాన్ని ఆమె భర్త ఫేస్ బుక్ లో పంచుకున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ చాలామంది ఆ పోస్టింగ్ కి రిప్లై ఇస్తున్నారు. మీరు కూడా చేపలు తినే సమయంలో అజాగ్రత్తగా ఉంటారా..? అయితే ఇప్పట్నుంచి జాగ్రత్తగా ఉండండి. పొరపాటున చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే థాయిల్యాండ్ మహిళలా ఇబ్బందిపడతారు జాగ్రత్త.

Related News

Body Double: ట్రంప్‌ను కలిసింది పుతిన్ కాదా.. ఆయన డూపా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే?

UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

Fact Check: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

RGV Tweet: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Big Stories

×