OTT Movies: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో సినిమాలు ఇటు ఓటీటీలోకి కూడా వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అందుకే ఇటు ఓటీటీలకి కూడా ఆదరణ భారీగా పెరుగుతోంది. మరి జూలై 31వ తేదీన ప్రత్యేకించి ఓటీటీ లో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. ముఖ్యంగా అందులో రెండు చిత్రాలను మాత్రం అసలు మిస్ అవ్వకండి. మరి ఓటీటీలోకి రాబోతున్న ఆ 4 చిత్రాలు ఏంటి? మరి ముఖ్యంగా ఆడియన్స్ ను థియేటర్లలో విపరీతంగా ఆకట్టుకున్న ఆ 2 చిత్రాలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల కీలక పాత్రల్లో జీఎంబి ఎంటర్టైన్మెంట్ కింద మహేష్ బాబు , నమ్రత శిరోద్కర్ సమర్పించిన చిత్రం రావు బహదూర్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఇందులో విభిన్నమైన గెటప్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హీరో సత్యదేవ్. తన కెరియర్ లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. దీనిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చల్లా అయ్యవు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గట్ట కుస్తీ 2. గతంలో వచ్చిన గట్ట కుస్తీ సినిమాకు సీక్వెల్ ఇది. ఇప్పటికే మొదటి భాగంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మేకర్స్.. రెండవ పార్ట్ తో కూడా అదే రేంజిలో మెప్పించే ప్రయత్నం చేశారు. ఇందులో రమ్యకృష్ణన్ , యోగి బాబు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం కూడా జూలై 31న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రాబోతోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అలాగే కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం అందించారు
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ ఓ లవ్. పవిష్ నారాయణ్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రీమియర్ కానుంది. తమిళ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రానికి మాగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించగా.. సెల్వ రాఘవన్, వనిత విజయ్ కుమార్, రమ్య, కె ఎస్ రవికుమార్, ఆదిత్య కతీర్ కీలక పాత్రలు పోషించారు.
also read: అనిల్ రావిపూడి పేరు మీద 2 షాపింగ్ మాల్స్.. పెద్ద చిక్కు వచ్చి పడిందే!
చిదంబరం దర్శకత్వంలో మలయాళ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన చిత్రం బాలన్ : ది బాయ్.. ఆదిశేషన్ KR, ఫర్జానా పాలతింగల్, టోవినో థామస్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జీ ఫైవ్ వేదికగా స్ట్రీమింగ్ కి రానుంది. ఇక థియేటర్లలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం అసలు మిస్ అవ్వకండి.