Chiranjeevi Health Issues : 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ చిరంజీవికి ఏమైంది ? ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే చిరంజీవి హెల్త్ గురించి ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నిన్న (ఆదివారం) రాత్రి కుబేర మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఆ సక్సెస్ మీట్‌కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఎప్పటిలానే స్టేజ్‌పైన చిరంజీవి కామెడీ బానే చేశాడు. “రష్మిక మందన్నా నేషనల్ క్రష్ మాత్రమే కాదు… నాకు కూడా” క్రషే అంటూ కామెంట్ కూడా చేశాడు. అక్కడి వరకు బానే ఉంది. కానీ, ఆ ఈవెంట్ మొత్తంలో చిరంజీవిని గమనిస్తే… ఆయనకు ఏదో అయింది అనిపిస్తుంది.
చిరులో మార్పులు..
ఈవెంట్‌లో ఆయనను కాస్త గమనిస్తే, ఆయన లుక్స్ చాలా వరకు మారిపోయాయని అనిపిస్తుంది. అలాగే వాయిస్‌లో కూడా తేడా గమనించొచ్చు. మాటలు కూడా కొంత వరకు డిఫరెంట్‌గా వచ్చాయి. అంతే కాదు, మెగాస్టార్ నిడిచే టైంలో కూడా ఆ డిఫరెంట్ కనిపించింది అని చాలా మంది అంటున్నారు. అయితే దీనికి నాన్ మెగా ఫ్యాన్స్ చిరంజీవి ఈవెంట్‌కు తాగి వచ్చాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. కానీ, ఈవెంట్‌లో చిరును చూస్తే, ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ? అనే క్వశ్చన్ రాకమానదు.
15 రోజుల క్రితం హాస్పిటల్‌లో చిరు ?
సాధారణంగా చిరంజీవి చాలా ఈవెంట్స్‌కి వెళ్తారు. కానీ, ఎప్పుడూ కూడా ఆయన హెల్త్ గురించి చర్చ రాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన లుక్స్, మాటల, వాయిస్ లో తేడాలు, నడవడంలో తేడాలు గమనించిన తర్వాత ఆయన హెల్త్ ఎలా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు.
పైగా ఆయన కొన్ని రోజుల క్రితం హాస్పిటల్‌కి వెళ్లారు. అప్పుడు రెగ్యూలర్ చెకప్ కు మాత్రమే హాస్పిటిల్ కి వెళ్లారు అని మెగాస్టార్ చిరంజీవి టీం చెప్పింది. కానీ, ఇప్పుడు ఈవెంట్ తర్వాత ఈ చర్చ జరుగుతున్నప్పుడు హాస్పిటిల్ కి వెళ్లడం ఎందుకు? అనే అనుమానాలు కూడా అభిమానులకు వస్తున్నాయి. ఆయనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ? లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా ? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
కారణం అదేనా ?
అయితే, దీనిపై కొంత మంది వేరే విధంగా స్పందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం 70 ఏళ్ల వయసు వచ్చారు. ఆగష్టులో 70 పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ వయసులో ఇలా ఉండటమే చాలా గొప్ప. అలాగే, ఆయన ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి విశ్వంభర షూటింగ్ పూర్తి అయింది. అలాగే మరో మూవీ… అనిల్ రావిపూడితో చేస్తున్నాడు.
సంక్రాంతికి రిలీజ్ చేయడమే లక్ష్యంగా ఈ మూవీ షూటింగ్ వేగంగా చేస్తున్నారు. ఇటీవలే ముస్సోరీలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఈ పని ఒత్తడిలో పడి అలా అయిఉండొచ్చు అని కొంత మంది అంటున్నారు.