Raghanandan Rao: మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఆయనకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. తాము మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులం అంటూ.. ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్ స్కూల్ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.
ALSO READ: Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆగంతకులు కాల్ చేసినప్పుడు రఘునందన్ రావు పీఏ ఫోన్ లిఫ్ట్ చేశాడు. జరిగిన విషయాన్ని వెంటనే పీఏ ఆయనకు వివరించాడు. దీంతో రఘునందన్ రావు బెదిరింపు కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. అయితే ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: Telangana Cabinet Meeting: కేబినేట్ సమావేశం.. బనకచర్లపై హాట్ డిబేట్..
బెదిరింపులకు భయపడేది లేదు: రఘునందన్ నావు
ఈ సంఘటనపై ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ‘నేను మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి పీపుల్స్ వార్ మావోయిస్టులమంటూ ఒకరు కాల్ చేశారు. ఇప్పుడే మావోయిస్ట్ దళం మధ్యప్రదేశ్ నుంచి బయల్దేరిందని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటల లోపులో చంపేస్తామని అన్నారు. రెండో సారి మళ్లీ కాల్ చేశారు. ఈ రోజు రాత్రి 12 గంటలకే డెడ్ లైన్.. జాగ్రత్త అని చెప్పారు. మేం వస్తున్నాం. బయల్దేరుతున్నాం. అని కాల్‌లో మాట్లాడారు’ అని రఘునందన్ రావు తెలిపారు.
ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతోన్న నక్సలైట్ల ఏరివేతకు సంబంధించి మావోయిస్టు పార్టీ ఇలా కావాలని చేస్తుందేమో అని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొంటామని తాము ఎదుర్కొంటామని ఎంపీ రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు.