E-Paper
Advertisement

కోడాక్ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల..రేట్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

కోడాక్ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల..రేట్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు
Advertisement

Kodak new smart tvs: హోమ్ ఎంటర్‌ టైన్‌మెంట్ లవర్స్ ప్రముఖ టెక్ బ్రాండ్ కోడాక్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. మార్కెట్లోకి సరి కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల చేసింది. కేవలం రూ.6,999 ప్రారంభ ధరతో.. వివిధ సైజుల్లో లభించే ఈ టీవీలు టెక్కీలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఇందులో హై-ఎండ్ ఫీచర్లతో కూడిన 55- ఇంచుల మినీ-క్యూడీ, పవర్ ఫుల్ 80W స్పీకర్ల సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అసలు ఈ కొత్త టీవీల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!

సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా.. బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు అందుబాటులో.. ఉండాలనే.. ఉద్దేశంతో కోడాక్ వీటి ధరలను అత్యంత ఆకర్షణీయంగా ఉంచింది. ఈ కొత్త సిరిస్‌లో బేసిక్ మోడళ్ల ధరలు కేవలం రూ.6,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. వివిధ స్క్రీన్ సైజులు , ఫీచర్ల ఆధారంగా వీటి ధరలు మారుతుంటాయి. మార్కెట్లో లభించే.. ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు అందించడం కోడాక్ ప్రత్యేకత.

55 ఇంచుల మినీ-క్యూడీ 4K టీవీ విశేషాలు:

Advertisement

డిస్‌ప్లే , కలర్స్: ఇది మినీ ఎల్ఈడీ బ్యాక్‌ లైటింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో.. ఏకంగా 1.1 బిలియన్ల కలర్స్ , డాల్బీ విజన్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల పిక్చర్స్ అత్యంత స్పష్టంగా, సహజ మైన రంగులతో కనిపిస్తాయి.

బ్రిట్‌నెస్ ,రిఫ్రెష్ రేట్: ఈ స్క్రీన్ గరిష్టంగా 550 నిట్స్ వరకు బ్రైట్‌ నెస్‌ను అందిస్తుంది. అలాగే గేమింగ్ , యాక్షన్ మూవీస్ చూసేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా ఉండటానికి 120Hz రిఫ్రెష్ రేట్, VRR, ALLM సపోర్ట్‌ను అందించారు.

Advertisement

80W స్పీకర్లు: సౌండ్ విషయంలో.. ఈ టీవీ అద్భుతమనే చెప్పాలి. ఇందులో ఏకంగా.. 80W అవుట్‌ పుట్ కలిగిన క్వాడ్-స్పీకర్ సిస్టమ్ ఉంది. దీనికి తోడు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటంతో.. ఎక్స్‌టర్నల్ హోమ్ థియేటర్ అవసరం లేకుండానే అదిరి పోయే సరౌండ్ సౌండ్ లభిస్తుంది.

Also Read: అమెజాన్ సేల్‌లోబెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్, బ్లెండర్స్‌పై భారీ డిస్కౌంట్

ఇతర మోడల్స్, జియోటెలి ఓఎస్ సపోర్ట్:

ఈ కొత్త శ్రేణిలో భాగంగా కంపెనీ 65-ఇంచుల వరకు పెద్ద స్క్రీన్ సైజులను కూడా పరిచయం చేసింది. జియోటెలి ఓఎస్ ఆధారంగా పని చేసే ఈ టీవీలలో 300కి పైగా ఉచిత లైవ్ ఛానెల్స్, జియో గేమ్స్, మల్టీలింగువల్ వాయిస్ రిమోట్ సపోర్ట్ లభిస్తున్నాయి. అలాగే Coolita 3.0 లినక్స్ ప్లాట్‌ ఫారమ్‌తో వచ్చే మోడల్స్ 24, 32, 40, 43 , 50 ఇంచుల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీలివ్ , జీ5 వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ అన్నీ ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి. కొన్ని మోడళ్లలో 40W సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంది.

మీ ఇంట్లో పాత టీవీని మార్చి కొత్త హై-టెక్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తుంటే.. కోడాక్ విడుదల చేసిన ఈ కొత్త శ్రేణి అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. రూ.6,999 ప్రారంభ ధరతో.. పాటు 55 ఇంచుల మినీ-క్యూడీ టీవీలో ఉన్న 80W పవర్‌ ఫుల్ సౌండ్ వంటి ఫీచర్లు కస్టమర్లకు సరికొత్త ఫీల్ ఇస్తాయి.

Related News

ఫేస్‌బుక్ ఈమెయిల్ అడ్రస్ మార్చడం ఎలా? సింపుల్ స్టెప్స్ ఇవే!

5-స్టార్ ఏసీ కొన్నా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి!

మ్యాక్‌బుక్ కొనాలనే డ్రీమ్‌ నెరవేర్చుకునే టైమ్ వచ్చింది.. అమెజాన్ సేల్‌లో రూ.68 వేలకే లభ్యం!

ఛార్జర్లతో పనే లేదు..3 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే పవర్‌ఫుల్ ఫోన్లు!

ఆర్కుట్ రీఎంట్రీ.. పుష్కర కాలం తర్వాత మళ్లీ, ఫేస్‌బుక్-ఎక్స్ ఆధిపత్యానికి బ్రేక్?

ఇంట్లోనే కెఫే లాంటి కాఫీ రావాలా? రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ కాఫీ మెషిన్స్ ఇవే!

బంపర్ ఆఫర్..75 ఇంచుల టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్

Big Stories

Advertisement
×