E-Paper
Advertisement

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. వారి కోసమే ప్రత్యేకంగా?

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. వారి కోసమే ప్రత్యేకంగా?
Advertisement

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా హోస్ట్ గా కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్(Salman Khan) తాజాగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్(Youtube channel) ప్రారంభించారు. పిల్లల కోసమే ప్రత్యేకించి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు తెలియజేశారు.‘బీయింగ్‌ సల్మాన్‌ ఖాన్‌’ (Beling Salman khan) పేరుతో ప్రారంభించారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలకు సరికొత్త వినోదాన్ని అందించడమే లక్ష్యం అని చెప్పారు.

పిల్లల కోసమే ప్రత్యేకించి..

ఈ యూట్యూబ్ ఛానల్ లోని వీడియోలు పెద్దల కోసం కాదని, పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నామని తెలుపుతూ ఈయన చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. “నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే ఈ యూట్యూబ్ ఛానల్ లో వస్తున్నటువంటి కంటెంట్ మీకు పెద్దగా నచ్చకపోవచ్చు ఎందుకంటే అది మీకోసం రూపొందించింది కాదని కేవలం పిల్లల కోసం రూపొందించిన కంటెంట్ అని,వినోదం, ప్రేమ, కుటుంబ బంధాలతోపాటు పిల్లలకు విద్య కూడా ఎంతో అవసరం కదా”అంటూ ఈయన తన యూట్యూబ్ ఛానల్ గురించి తెలిపారు.

సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ మ్యూజిక్‌ యూట్యూబ్ ఛానల్..

Advertisement

ఈ విధంగా సల్మాన్ ఖాన్ ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ గంట వ్యవధిలోనే 14000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించారు. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలకు నటనలోని ప్రాథమిక అంశాలను సరదాగా నేర్పిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, హావభావాలు వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా ఉండబోతున్నాయని తెలిపారు.  ఇకపోతే సల్మాన్ ఖాన్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఇది మొదటిసారి కాదు.2020లో ‘సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ మ్యూజిక్‌’ పేరుతో ఓ ఛానల్‌ను ప్రారంభించారు.

30 లక్షల మంది ఫాలోవర్స్..

ఈ యూట్యూబ్ ఛానల్ లో ఈయనకు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్ లో సల్మాన్ పాడిన  ప్యార్‌ కరోనా, తేరే బినా వంటి పాటలను విడుదల చేశారు. తాజాగా పిల్లల కోసం మరొక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఇలా సినీ నటుడుగా కొనసాగుతూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ వస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో హోస్ట్ గా కూడా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీలో ఈ కార్యక్రమం 20వ సీజన్ ప్రసారమవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మాతృభూమి సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

Also Read: బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!

Related News

సాయి పల్లవిని చంపేయాలనుకున్నా.. అది పెట్టుకోలేకపోయా: అనుపమ షాకింగ్ కామెంట్స్

‘నవరాత్రి స్పెషల్’.. కళ్ళతోనే కూచిపూడి ఆడిన స్టార్ హీరోయిన్!

రవితేజ కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. ఊహించని స్టార్ కాస్ట్!

బలవంతం చేశారు.. ‘మల్లీశ్వరి’ లో పాత్ర పై సింగర్ షాకింగ్ కామెంట్!

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

Big Stories

Advertisement
×