Chiranjeevi:ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్ దాడి చేసినప్పటికీ.. మనోధైర్యంతో.. చేతులు, మెడ తెగి రక్తం ధారగా కారుతున్నా.. తీవ్రగాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్నా.. ప్రాణాలు పోయే క్షణాలలో కూడా.. హనుమాన్ చాలీసా ను పఠిస్తూ.. తనను నమ్మి విమానం ఎక్కిన ప్రయాణికులను చాలా జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరవేయడానికి ప్రముఖ పైలట్ స్మిత్ మచ్చార్ చేసిన సాహసం అందరిని ఆశ్చర్యపరిచింది . ఆంజనేయస్వామి నామస్మరణతో మృత్యువు అంచుల దాకా వెళ్లి.. ఒంటి చేత్తో 174 మంది ప్రాణాలను కాపాడిన ఈ రియల్ హీరో త్వరగా కోలుకోవాలి అంటూ పెద్ద ఎత్తున కోరుతున్నారు. ముఖ్యంగా ఆకాశంలో చోటు చేసుకున్న ఈ అపూర్వ సాహసగాథ ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇక ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించి, చేసిన కామెంట్లు ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతున్నాయి..
చిరంజీవి తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. “తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా.. తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయిల్ కి వెళ్తున్న విమానంలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ.. సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడివై కాపాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్య సాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు..’ జై హనుమాన్’ ” అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరొకవైపు స్మిత్ మచ్చార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన వైద్య ఖర్చులు ,సహాయం కోసం GoFundMe లో నిధులు సేకరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు 1700 మంది దాతలు ముందుకు వచ్చి సుమారుగా రూ.1.36 కోట్ల విరాళాలు అందించారు. ఆయన చూపిన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.
also reada:బిగ్ బాస్ బూతు షో కాదా? మిథిలేష్ రియాక్షన్?
అసలేం జరిగిందంటే.. దుబాయ్ నుండి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో (FZ 1073) 174 మంది ప్రయాణికులు ఉన్నారు. సరిగ్గా ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో కాక్ పిట్ లో ఉన్న కో – పైలట్ ఊహించని విధంగా కెప్టెన్ స్మిత్ పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి, విమానాన్ని నేలకేసి కొట్టేందుకు ప్రయత్నించాడు. క్షణాల వ్యవధిలోనే విమానం సుమారు 1400 అడుగుల మేర కిందకు దూసుకు వచ్చింది. మెడ , ఛాతీ పై బలమైన గాయాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ మాత్రం వెనక్కి తగ్గలేదు.. ప్రాణభయంతో వణికిపోకుండా, సమయస్ఫూర్తితో కాక్ పిట్ డోర్ ఎమర్జెన్సీ లాక్ లు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చేలా చేశారు. వెంటనే ఇతర సిబ్బంది సహకారంతో దుండగుడిని బంధించి, విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని తబుక్ లో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. రక్తం కారుతున్నా.. తోటి వారి ప్రాణాల కోసం ఒంటరి పోరాటం చేసిన ఈ భారతీయ పైలట్ దైవభక్తి , తెగువ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిసేలా చేస్తోంది.
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2026