OTT Movie : ఓటీటీలో సరికొత్త స్టోరీలతో వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో థ్రిల్లర్ జనర్ లో వస్తున్న స్టోరీలను చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఒక గ్రామంలో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది. దీనికి తోడు ఒక లవ్ స్టోరీ కూడా ఇందులో నడుస్తుంది. థ్రిల్లర్ అభిమానులకు సీట్ ఎడ్జ్ ఇచ్చే సిరీస్ ఇది. యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రోజు నుంచే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. బయటి నుంచి చూస్తే అతను ప్రశాంతంగా ఉండే వ్యక్తి. కానీ అతని లోపల ఒక ‘బీస్ట్’ దాగి ఉంటుంది. హింసాత్మక ఆలోచనలు, నియంత్రించలేని కోపం, క్రైమ్ పట్ల అతనికి ఒక విచిత్రమైన కోరిక ఉంటుంది. ఒక రోజు అతని గ్రామంలో జరిగే ఊహించని హత్యలు అతన్ని ఒక క్రైమ్ నెట్‌వర్క్‌లోకి లాగుతాయి. ఈ జర్నీలో అతను అంజలి అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో అతని ప్రేమ మొదలవుతుంది. కానీ అతని స్వభావం ఈ బంధాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది.
అంజలి కూడా ఒక ధైర్యవంతమైన ఇంటెలిజెంట్ యువతి. ఒక జర్నలిస్ట్‌గా ఈ గ్రామంలో జరిగే క్రైమ్‌లను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తుంటుంది. రాహుల్‌ను కలిసినప్పుడు, అతనిల స్వభావం ఆమెను ఆకర్షిస్తుంది. ఆ తరువాత వీళ్ళ ప్రేమ ఒక థ్రిల్లింగ్ బంధంగా మొదలవుతుంది. కానీ రాహుల్ గతం, అతని స్వభావం ఆమెను ఒక ప్రమాదకరమైన గేమ్‌లోకి లాగుతాయి. అంజలి రాహుల్‌ను అర్థం చేసుకోవడానికి, అతని స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూనే, తన గతంలోని రిస్క్ లను కూడా డీల్ చేయాల్సి వస్తుంది. ఇక అక్కడ జరిగే హత్యలకు, గ్రామదేవత శాపానికి లింకు ఉన్నట్లు సూచనలు వస్తాయి. చివరికి వీళ్ళ ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? ఆ గ్రామంలో హత్యలు ఎవరు చేస్తుంటారు ? ఈ జంట క్రైమ్ ఉచ్చులో ఎలా పడుతుంది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే ప్రశ్నలకు ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
‘Janaawar – The Beast Within’ అమిత్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో భువన్ అరోరా లీడ్ రోల్‌లో, సుహాసిని ములాయ్, గౌరవ్ పాండే సపోర్టింగ్ రోల్ లో నటించారు. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 9 నుంచి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్‌లలో ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది.8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్IMDb రేటింగ్ 7.2/10 పొందింది.
Read Also : క్షుద్ర పూజలతో మేల్కొలుపు… అంతులేని ఆకలున్న దెయ్యం ఇది… కామెడీతో కితకితలు పెట్టే తెలుగు హర్రర్ మూవీ