BigTV English

Vishwambhara: చాలా రోజుల గ్యాప్ తర్వాత విశ్వంభర సెట్స్ కి చిరు.. స్పెషల్ ఏంటంటే?

Vishwambhara: చాలా రోజుల గ్యాప్ తర్వాత విశ్వంభర సెట్స్ కి చిరు.. స్పెషల్ ఏంటంటే?

Vishwambhara: బింబిసారా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. కళ్యాణ్ రామ్ వంటి హీరోతో కూడా సక్సెస్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.


ఈ సినిమా తర్వాత బింబిసారా 2 సినిమా చేస్తాడు అని అందరూ ఊహించారు. కానీ ఈ ఊహలన్నిటిని మించి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట సినిమా చేయడం మొదలు పెట్టాడు. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉండేవి. కానీ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వచ్చిన తర్వాత అంచనాలు కొంతమేరకు తగ్గాయి. టీజర్ క్వాలిటీ విషయంలో కూడా పలు సమస్యలు చిత్ర యూనిట్ కు ఎదురయ్యాయి.

విశ్వంభర సెట్స్ కి చిరు


ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కేవలం ఒక పాట మాత్రమే పెండింగ్ ఉంది. ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సాంగ్ రేపు షూట్ చేయనున్నారు. ఈ పాటతో సినిమా దాదాపుగా పూర్తయిపోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకో రెండు మూడు రోజులు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ కూడా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వశిష్ట తెలిపారు. వినడానికి ఈ స్టోరీలే చాలా అద్భుతంగా ఉంది. వి ఎఫ్ ఎక్స్ విషయంలో కేర్ తీసుకుంటే ఈ సినిమా ఫలితం ఇంకోలా ఉంటుంది. అయితే చిత్ర యూనిట్ ఏ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్నారో దాదాపు అది 80% వరకు మ్యాచ్ అయిపోయింది.

చాలా ఏళ్లు తర్వాత ఆ జోనర్ 

మెగాస్టార్ చిరంజీవి సోసియా ఫాంటసీ జోనర్ సినిమాలు చేసి చాలా రోజులు అయిపోయింది. ఈ జోనర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత అంజి సినిమా ఈ జోనర్లో చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఈ జోనర్లో సినిమాను చేయలేదు. అందుకోసమే దర్శకుడు వశిష్ట ఈ జోనర్ ఎంచుకున్నారు. అలానే ఈ సినిమాలు చేయడానికి తనను ఏ ఏ సినిమాలు ఇన్స్పైర్ చేశాయో, వశిష్ట ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేసి ఆలోచనలో ఉన్నారు. దీని గురించి అధికార ప్రతి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Also Read: Pawan Kalyan : మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి.. ఆ విషయంలో ఫ్యాన్స్ కి గ్రీన్ సిగ్నల్

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×