Bigg Boss:ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీమణులను మొదలుకొని వెండితెర స్టార్ హీరోయిన్ల వరకు చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది పెళ్లికి ముందే కాలుజారి, ఆ తర్వాత వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ (Amalapaul) ను మొదలుకొని ఇలియానా(Ileana ) వరకు చాలా మంది ఇలాంటి కోవకే వస్తారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బిగ్ బాస్ (Bigg Boss) బ్యూటీ వచ్చి చేరింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు అలాంటి అనుమానాలనే రేకెత్తిస్తున్నాయి. మరి ఆమె ఎవరు? అసలు ఏం జరిగింది? ట్రోల్స్ రావడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ప్రియుడితో పీకల్లోతు మునిగిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.
ఈమె ఒకప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరి సీరియల్ ముగిసే సమయానికి ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం అందుకొని, తన క్యారెక్టర్ తో, మంచి మనసుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు టాస్క్ లలో సత్తా చాటుతూ టాప్ 5 లో టాప్ 3గా నిలిచి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈమె బుల్లితెర నటుడితో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
పెళ్లి కాకుండానే తల్లి అయిందా?
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనితో చట్టపట్టలేసుకొని తిరుగుతూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక నిత్యం రొమాంటిక్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం భారీ సెట్ వేసి తన ప్రియుడికి పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఈమె.. ఆ తర్వాత బీచ్ లో ఫోటోలు దిగి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ బీచ్ ఫోటోలు ఇప్పుడు పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇందులో ఈమె ప్రెగ్నెంట్ అన్నట్లుగా కనిపించింది.
ప్రియాంక పై నెటిజన్స్ ట్రోల్స్..
దీంతో పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ .మరికొంతమంది దయచేసి పెళ్లి చేసుకోండి.. ఇలా వరుసగా ఫోటోలు షేర్ చేయడం వల్ల లేనిపోని అనుమానాలు క్రియేట్ అవుతాయి. పెళ్లి చేసుకుంటే ఇక మిమ్మల్ని అడిగే వారే ఉండరు కదా.. అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది ఎంజాయ్ చేసింది చాలు ఇక పెళ్లి చేసుకోండి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే బీచ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు పలు ట్రోల్స్ తో పాటు అనుమానాలు రేకెత్తించేలా ఉండడం గమనార్హం.
ఆ భయమే పెళ్లికి అడ్డొస్తోందా?
వాస్తవానికి వీరిద్దరూ బిగ్ బాస్ కంటే ముందే సహజీవనం చేస్తున్నారు. ఇక ఆమె కూడా తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టగా.. అతడు కూడా యస్ చెప్పారు. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పెళ్లి చేసుకోవడానికి ఆ భయం వీరికి అడ్డుగా మారిందని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడం వల్ల పెళ్లి, తర్వాత మీద పడే బాధ్యతలకు ఈ జంట భయపడుతోందని, అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నారని సమాచారం.
also read: Abhishek Bachchan: ఐశ్వర్యతో ముదిరిన వ్యవహారం.. ఒంటరితనాన్ని కోరుకుంటున్న అభిషేక్.. పోస్ట్ వైరల్!