BigTV English

Pomegranate: వర్షాకాలంలో దానిమ్మ తింటే ?

Pomegranate: వర్షాకాలంలో దానిమ్మ తింటే ?

Pomegranate: వర్షాకాలం చల్లదనం , తాజాదనాన్ని తెస్తుంది. మరోవైపు.. ఈ సీజన్ అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. ఈ సమయంలో.. ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి లేకపోవడం సర్వసాధారణం అవుతాయి. ఇలాంటి పరిస్థితిలో.. మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. కొన్ని రకాల పండ్లు తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు. అలాంటి వాటిలో ప్రధానమైనది దానిమ్మపండు. వర్షాకాలంలో దానిమ్మ పండ్లు తింటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


దానిమ్మ తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు: 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
వర్షాకాలంలో జలుబు, దగ్గు , వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వ్యాధులతో పోరాడటానికి బలం లభిస్తుంది. అంతే కాకుండా సాధారణ వర్షాకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా దానిమ్మ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వర్షాకాలంలో.. అత్యంత సాధారణ సమస్య కడుపుకు సంబంధించినది. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగించి, పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు దానిమ్మ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది:
వర్షాకాలంలో చర్మంపై తేమ, జిగురు కారణంగా మొటిమలు, దద్దుర్లు వస్తాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E చర్మ కణాలకు మేలు చేస్తాయి. అంతే కాకుండా సహజమైన మెరుపును అందిస్తాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, లోపలి నుంచి ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయ పడుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం తరచుగా దానిమ్మ తినడం మంచిది. ఇది మీకు మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి:
దానిమ్మలో పాలీఫెనాల్స్ , పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో దానిమ్మ రక్త పోటును సమతుల్యం చేయడంలో.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరిపోవాలా ?

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది:
వర్షాకాలంలో మనం తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దానిమ్మలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలసట , బలహీనత నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది.

వర్షాకాలంలో దానిమ్మ తినడం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా చర్మం, జీర్ణ క్రియ, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. ఈ సీజన్‌లో మీ రోజువారీ ఆహారంలో దానిమ్మను చేర్చుకోవడం ద్వారా.. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×