E-Paper
Advertisement

మీ ఆశీర్వాదం నాకు కావాలి : మేఘాంశ్ శ్రీహ‌రి

మీ ఆశీర్వాదం నాకు కావాలి : మేఘాంశ్ శ్రీహ‌రి
Advertisement

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన అతి చిన్న వయసులోనే చనిపోయిన విషయం తెలిసిందే. నటుడు శ్రీహరి భౌతికంగా లేకపోయినా సినిమాలు ఎప్పుడు ఆయనను గుర్తుచేస్తుంటాయి. ఆగస్టు 15న ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.. అంతే కాదు ఆయన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.. ప్ర‌తీ ఏడాదిలాగానే ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇదే ప్రాంతంలోనే శ్రీహ‌రి కుమార్తె అక్ష‌ర స్మార‌క ప్రాంతం కూడా ఉంటుంది. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో శాంతి శ్రీహ‌రి, హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు..

ఈ వేడుకలో శ్రీహరి తనయుడు హీరో మేఘాంశ్ శ్రీహ‌రి మాట్లాడుతూ..ఈరోజు నాన్న‌గారి 62వ బ‌ర్త్ డే. ఆయ‌న జ‌యంతిని నిర్వ‌హించాం. ఈ మండ‌పంలోనే చెల్లి అక్ష‌రకు చెందిన స్మార‌కం కూడా ప‌క్క‌నే ఉంటుంది. నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నేను న‌టించిన ఆస్మాన్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. అంద‌రికీ విష్ యు హ్య‌పీ ఇండిపెండెన్స్ డే అన్నారు.

Advertisement

అనంతరం శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ.. ఈరోజు బావ‌(శ్రీహ‌రి) 62వ పుట్టిన‌రోజు. ఆయ‌న ఈరోజు మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఎప్ప‌టికీ మ‌న హృద‌యంలోనే ఉంటాడు. అలాగే అంద‌రికీ సాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ లాంచ్ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆస్మాన్ సినిమా విషయానికొస్తే..

మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆస్మాన్‌’. రామ్‌నందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొండారు వెంకటేష్‌, మన్నెం శ్రీకాంత్‌ నిర్మిస్తున్నారు. నటుడు శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మేఘాంశ్ మంచి టాక్ ని సొంతం చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై అంచనాలు పెరగడంతో సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.. ఎలాంటి స్టోరీ తో ఈ సినిమా రాబోతుంది అన్నది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Advertisement

స్వర్గీయ నటుడు రియల్ హీరో శ్రీహరి సినిమాల విషయానికొస్తే.. విలన్ గా, సపోర్టింగ్ రూల్స్, అలాగే హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు.. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి అతి చిన్న వయసులోనే మరణించడంతో ఆయన అభిమానులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.. ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయింది అంటూ ఇప్పటికీ కూడా అభిమానులు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఆయన వారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మేఘాంశ్ ను ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నారు.

Also Read :సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Related News

బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. ఆ హీరోలకు లీగల్ నోటీసులు…

లైవ్ లో ఏడ్చేసిన ఫరియా.. దిమ్మతిరిగే కౌంటర్ భయ్యా..!

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

Big Stories

Advertisement
×