Sunil Gavaskar On KL Rahul injury scare: టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs India) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Galle International Stadium, Galle) వేదికగా నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ నిన్న ప్రారంభమైంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రానిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 288 పరుగులు సాధించింది.
దేవదత్ పడిక్కల్ ( Devdutt Padikkal) అద్భుతమైన సెంచరీ తో ఇరగదీశాడు. అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ దిశగా దూసుకు వెళ్లిన కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ ( KL Rahul retired hurt) కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గాయంతో కేఎల్ రాహుల్ వెను దిరిగిన సంఘటనపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) చాలా సీరియస్ అయ్యారు. టీమిండియా జట్టులో ప్లేయర్ల ఫిట్నెస్ చూడకుండానే సెలెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫిట్ గా లేకున్నా కొంత మంది ప్లేయర్లను సెలెక్ట్ చేయడం వల్ల.. కేఎల్ రాహుల్ తరహాలో రిటైర్డ్ హార్డ్ అవుతున్నారని మండిపడ్డారు.
కె ఎల్ రాహుల్ గాయపడ్డ సంఘటనపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ పై బీసీసీఐ సరిగా దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆగ్రహించారు. కొంత మంది జాతీయ జట్టుకు ఆడమంటే గాయాల పేరుతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు.
మరి కొంత మంది గాయాలు దాచుకొని, ఫిట్ గా లేకున్నా బరిలో దిగుతున్నారని సీరియస్ అయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత క్రికెటర్ల ఫిట్నెస్ పై బీసీసీఐ పట్టించు కోకపోవడం అత్యంత దారుణం అన్నారు. అందుకే ప్లేయర్లు డజన్ల కొద్ది గాయాల పాలు అవుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికైనా బీసీసీఐ మొద్దు నిద్ర వీడకపోతే, పెను ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించారు సునీల్ గవాస్కర్.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా 77 పరుగులు చేసిన రాహుల్, టి విరామం తర్వాత బ్యాటింగ్ చేయలేక వెనుతిరిగాడు. తీవ్రమైన కండరాల నొప్పులు, కుడి చేతి వేలి అసౌకర్యం కారణంగా అతడు రిటైర్డ్ హార్ట్ గా మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో పెవిలియన్ కు వెళ్లే క్రమంలో మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో కేఎల్ రాహుల్ కనిపించిన ఫోటోలు బయటకు వచ్చాయి.
A worrying moment in Galle. 😟💔
KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.
He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️
📸:… pic.twitter.com/Q8w6XdHuwx
— CricTracker (@Cricketracker) August 15, 2026