Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో వినపడుతున్న పేరు. ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు, సౌత్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ హీరోయిన్ గా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా ఈమె వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉన్న ఈమె తాజాగా సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈమె అజయ్ దేవగన్ (Ajay Devagan) తో కలిసి నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 (Son Of Sardar 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు ఒకటో తేదీ విడుదల అయింది.
నిరాశపరిచిన సన్ ఆఫ్ సర్దార్ 2..
ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని నటి మృణాల్ కు కామెంట్ చేస్తూ.. “ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ చూడటం వల్లే తనకు సినిమా చూసే ఆసక్తి కూడా రాలేదని అందుకే సినిమా చూడలేదు” అంటూ కామెంట్ చేశారు. ఇలా అభిమాని చేసిన ఈ కామెంట్ పట్ల ఈమె స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
రివ్యూలను నమ్మొద్దు …
మృణాల్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ..”ఈ విధంగా సినిమాలకు ఇచ్చే రివ్యూలు ప్రేక్షకులను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాయి. అందుకే రివ్యూలను నమ్మకుండా సినిమా చూసి ఓ అభిప్రాయం తీసుకోవాలని” సూచించారు. ఇలా సినిమాలు ఫెయిల్యూర్ అవ్వడానికి నెగిటివ్ రివ్యూలు కూడా కారణమని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది సినిమాల విషయంలో ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ రివ్యూ ఇస్తూ సినిమాపై బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి రివ్యూల కారణంగా సినిమా కలెక్షన్ల పై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతుందని ఇదివరకు ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేశారు.
అడవి శేష్ డెకాయిట్…
ఇక తాజాగా మృణాల్ ఠాకూర్ సైతం ఇదే విషయం గురించి కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాల పనులలో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే . అదే విధంగా తెలుగులో హీరో అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న డెకాయిట్(Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇలా ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Jr.NTR: ఆ ఒక్క కారణంతోనే వార్ 2 చేశా… అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్!