Mrunal Thakur: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సీరియల్స్ ద్వారా కెరియర్ ను ఆరంభించింది. 2012లో “ముజ్ సే కుచ్ కెహతి.. ఏ ఖామోషియాన్” అనే సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది..ఆ తర్వాత మరాఠీ సినిమా 2014లో వచ్చిన ‘విట్టి దండు’ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత హిందీ , తెలుగు సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లోకల్ ట్రైన్ దూకి చనిపోవాలనుకున్నాను – మృణాల్ ఠాకూర్
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఒకానొక సమయంలో ట్రైన్ దూకి చనిపోవాలని అనుకుందట. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన కెరియర్ తొలినాళ్ళల్లో పడిన ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” నాకు , కుంకుమ రేఖ సీరియల్ మంచి గుర్తింపును అందించింది. కానీ సినిమా ఆడిషన్లకు వెళ్లేటప్పుడు టీవీ నటి అనే ఒక ట్యాగ్ తో చాలామంది నన్ను చులకనగా చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డిప్రెషన్ ను తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకేయాలనిపించినా.. తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయాను” అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది. మొత్తానికైతే సీరియల్ నటి అనే ట్యాగ్ తో చాలామంది తనను చులకనగా చేసి చూశారు అని, ఆ క్షణం తట్టుకోలేక చనిపోవాలనుకున్నాను అంటూ మృణాల్ తన బాధను చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఇలాంటి కష్టాలు తప్పవు అని కామెంట్లు చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ సినిమాలు..
ఇకపోతే 2014 నుంచి 2022 వరకు హిందీ మరాఠీ సినిమాలలో నటించి బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. 2022 హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాలో సీతా క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక్కడ చీరకట్టుతో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ నాని (Nani) తో కలిసి హాయ్ నాన్న (Hai Nanna) సినిమా చేసిన ఈమె.. ఈ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే గత ఏడాది విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో కలిసి ‘ ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు అడివి శేష్ (Adivi sesh) హీరోగా నటిస్తున్న డెకాయిట్(Decoit) సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. శృతిహాసన్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆస్థానాన్ని భర్తీ చేసిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.