BigTV English

Indian Railways: రైలు మిస్సయిన ఫ్యామిలీ.. జరిమానా చెల్లించనున్న రైల్వే, అదెలా?

Indian Railways: రైలు మిస్సయిన ఫ్యామిలీ..  జరిమానా చెల్లించనున్న రైల్వే, అదెలా?

భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ, కొన్నిసార్లు రైల్వే అధికారులు చేసే పొరపాట్ల కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతుంటారు. రైళ్లు మిస్సై సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఘజియాబాద్ స్టేషన్ లో ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఓ కుటుంబం రైలు మిస్ అయ్యింది. అధికారులను రీఫండ్ కోసం సంప్రదించినా పట్టించుకోకపోవడంతో, వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తాజాగా వారికి అనుకూలంగా కీలక తీర్పు వచ్చింది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఘజియాబాద్ కు చెందిన అనుభవ్ ప్రజాపతి తన భార్య ఇద్దరు పిల్లలో కలిసి రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. చత్తీస్‌ గఢ్ ఎక్స్‌ ప్రెస్ లో ఝాన్సీకి వెళ్లాలి. ఉదయం 3:20 గంటలకు రైలు బయల్దేరాలి. అంతకు ముందే ఆ కుటుంబం అక్కడికి చేరకుంది. ఆ రైలు సుమారు 40 నిమిషాలు ఆలస్యం అవుతుందని చెప్పారు. అంతేకాదు, రైలు ప్లాట్ ఫారమ్ నెంబర్ 3కి వస్తుందని చెప్పారు. చెప్పినట్లుగానే ఫ్లాగ్ ఫారమ్ 3కి వెళ్లారు.  కానీ, ఆ ప్లాట్ ఫారమ్ 3 మీద అయోధ్య ఎక్స్ ప్రెస్ 45 నిమిషాలకు పైగా ఆగి ఉంది. తాము ప్రయాణించాల్సిన రైలు గురించి తెలుసుకునేందుకు ప్రజాపతి స్టేషన్ మాస్టర్ కోసం వెతికారు. కానీ, ఆయన ఆఫీస్ కు తాళం వేశారు. ఉదయం 5.21 గంటలకు రైల్వే అధికారులకు ట్వీట్ చేశారు. కానీ, వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం 6:00 గంటలకు చత్తీస్‌గఢ్ ఎక్స్‌ ప్రెస్ 2వ ప్లాట్‌ ఫారమ్ మీదుగా వెళ్లిపోయింది.


Read Also: ఈ నగరంలో అస్సలు ట్రాఫిక్ జామ్ లే ఉండవు.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

పరిహారం చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం

తమకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే రైలు మిస్సయ్యామని రైల్వే అధికారులకు చెప్పారు ప్రజాపతి. తమకు రీఫండ్ ఇవ్వాలన్నారు. రైల్వే నిబంధనల ప్రకారం రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, రీఫండ్ ఇవ్వడం సాధ్యం అవుతుందన్నారు రైల్వే అధికారులు. వారి తీరుపై ప్రజాపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తాము రైలు ఎక్కలేకపోయామని, ఘజియాబాద్ స్టేషన్ అధికారులు, నార్త్ రైల్వే అధికారులు బాధ్యత వహించాలన్నారు. ప్రజాపతి వ్యాఖ్యలతో ఏకీభవించిన వినియోగదారుల ఫోరం.. సుమారు రూ. 7 వేలు చెల్లించాలని రైల్వే అధికారులను ఆదేశించింది. రైల్వే అధికారులు సరిగా వ్యవహరించే ఉంటే, ఓ కుటుంబ రైలు మిస్ అయ్యే అవకాశం ఉండేది కాదన్నారు. వారి అత్యవసర పనులకు ఇబ్బంది కలిగి ఉండేది కాదని చెప్పారు. వారికి కలిగిన ఇబ్బందికి రైల్వే బాధ్యత వహించాల్సిందేనని వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది.  తెల్లవారుజామున 3 గంటలకు రైల్వే స్టేషన్ కు వచ్చినా, ఆలస్యంగా వచ్చిన రైలు అందుకోకపోవడానికి రైల్వే అధికారులే కారణం అని వెల్లడించింది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారాన్ని అందించాలని ఆదేశించింది.

Read Also: హైదరాబాద్ మెట్రోకు ఒక్క రోజులో అంత ఖర్చవుతుందా? అస్సలు నమ్మలేరు!

 

Related News

Goa Weekend Trip: వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రైళ్లలో నేరుగా వెళ్లిపోవచ్చు!

IRCTC Tour Packages: IRCTC ఇంటర్నేషనల్ టూర్స్, ఏకంగా విమానంలో ఎగిరిపోవచ్చు!

Longest Train: ఈ రైలు ఎక్కితే వాంతులు చేసుకుంటారు.. ఇండియాలో ఇదే అత్యంత డర్టీ ట్రైన్!

Crime News: ఉన్నట్టుండి.. స్నేహితుడిని రైలు కిందకు తోసేసిన ఫ్రెండ్.. అసలు సంగతి తెలిసి షాక్!

Festival Special Trains: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!

Train Accident: బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!

Big Stories

×