Squid game in Tollywood actors: స్క్విడ్ గేమ్ (Squid game) దక్షిణ కొరియా డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా టెలివిజన్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా పందెంలో ఓడిపోతే అటు కోళ్లు కానీ గుర్రాలు కానీ బ్రతికి పోతాయి. కానీ మనుషులతో ఆడే ఈ స్క్విడ్ గేమ్ లో ఓడిపోతే మాత్రం ఆట నుంచే కాదు ఏకంగా ఈ భూమి మీద నుండే శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఆద్యంతం ఉత్కంఠతో రూపొందిన ఈ కొరియన్ సీరీస్ ఏకంగా మూడు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు మూడవ సీజన్ కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఆద్యంతం ఆసక్తి పెంచుతున్న స్క్విడ్ గేమ్ సీరీస్..
ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా.. ఇప్పుడు ప్రతి భాషలో కూడా ఈ వెబ్ సిరీస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. “ధనం మూలం ఇదః జగత్” అనే కాన్సెప్ట్ తో స్వార్థం, మోసం, వంచన, వెన్నుపోటు, ద్రోహం నేటి ఆధునిక మానవుడి నర నరాల్లో.. రక్తానికి బదులుగా ప్రవహించే వీటిని.. తెరపై కళ్ళకు కట్టినట్లు చూపించిన గేమ్ ఇది. ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు హ్వాంగ్ డాగ్ హ్యూక్ దర్శకత్వం వహించారు. జీ హున్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు దక్షిణ కొరియన్ లాంగ్వేజ్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో మన టాలీవుడ్ స్టార్స్ నటిస్తే ఎలా ఉంటుంది? ఎవరు ఏ పాత్రకు సెట్ అవుతారు? అనే ఒక చిన్న ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఆ వీడియో ప్రకారం ఎవరు ఏ పాత్రలో సెట్ అయ్యారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
స్క్విడ్ గేమ్ లో టాలీవుడ్ స్టార్స్..
తాజాగా ఆ వీడియో లో మనం చూసినట్లయితే స్క్విడ్ గేమ్ లో మన టాలీవుడ్ స్టార్స్ నటిస్తే.. ప్లేయర్ 120 స్థానంలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), ప్లేయర్ 222 స్తానంలో ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan), ప్యానోజ్ గా సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda), స్నైబర్ కిల్లర్గా రష్మిక మందన్న(Rashmika mandanna), ప్లేయర్ 333 అడివి శేషు(Adivi shesh), ఫ్రంట్ మాన్ గా రానా దగ్గుబాటి(Rana Daggubati), సేల్స్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), డిటెక్టివ్ గా విశ్వక్ సేన్ (Vishwak sen), మెయిన్ లీడ్ ప్లేయర్ 456 గా మహేష్ బాబు(Maheshbabu )నటిస్తే బాగుంటుంది అంటూ ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరి ఏ ప్లేయర్ లో ఎవరు నటిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోవచ్చు.
ALSO READ:Jabardast NookaRaju: అతడితో ఆసియా పెళ్లి.. గుక్కపెట్టి ఏడ్చిన నూకరాజు!
?utm_source=ig_web_copy_link