Prabhas Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. రంగస్థలం సినిమా ఈ బ్యానర్ కు మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సీక్వెల్ కూడా అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రస్తుతం ఎన్నో భారీ సినిమాలు నిర్మితమవుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. అలానే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలు నిర్మితమవుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఫౌజీ అనేది కేవలం బయట వినిపిస్తున్న టైటిల్.
జైలుకు వెళ్తారు జాగ్రత్త..
ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోటో లీక్ అయింది. ఆ ఫోటోను షేర్ చేయటం వలన ప్రసాద్ శెట్టి అని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తమనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈలోపే చిత్ర యూనిట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
మీలో చాలా మంది #PrabhasHanu సెట్స్ నుండి ఒక చిత్రాన్ని షేర్ చేస్తున్నారని మేము గమనించాము. మీకు ఉత్తమ అనుభవాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము మరియు ఈ లీక్‌లు జట్టు యొక్క నైతికతను దెబ్బతీస్తాయి. అటువంటి చిత్రాలను షేర్ చేసే ఏ ఖాతా అయినా నివేదించబడి తొలగించబడటమే కాకుండా సైబర్ నేరంగా పరిగణించబడి తగిన విధంగా వ్యవహరించబడుతుంది.
మైత్రి మూవీ మేకర్ స్వయంగా ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇక్కడితో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా జాగ్రత్త పడటం మొదలుపెట్టారు. ఇప్పటికే తమ తోటి అభిమానిని అరెస్టు చేశారు అని మరోవైపు పోస్టులు కూడా పెడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం మీరు జాగ్రత్త పడాలి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా ఈ విషయంపైనే స్పందిస్తున్నారు.
We've observed that a lot of you are sharing a picture from the sets of #PrabhasHanu.
We are striving to give you the best experience, and these leaks bring the morale of the team down.
Any account sharing such pictures will not only be reported and brought down but will be…
— Mythri Movie Makers (@MythriOfficial) August 19, 2025
భారీ అంచనాలు
హను లాస్ట్ ఫిలిం సీతారామం (Sita Ramam) బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే అందరికీ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఊహించిన స్థాయిలో లేదని ఇప్పటినుంచే అనడం మొదలుపెట్టారు. ఏదేమైనా సినిమా మీద అయితే మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో మాత్రం సందేహం లేదు.
Also Read: Cm Revanth Reddy: సీఎం ఇంట్లో సుకుమార్, ఊహించని పరిణామం