BigTV English

Cm Revanth Reddy: సీఎం ఇంట్లో సుకుమార్, ఊహించని పరిణామం

Cm Revanth Reddy: సీఎం ఇంట్లో సుకుమార్, ఊహించని పరిణామం

Cm Revanth Reddy: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టిన సుకుమార్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సుకుమార్ చేసిన ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. ఇక అన్ని సినిమాలు వేరు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రేంజ్ వేరు. ఆ సినిమాతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగిపోయింది.


పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ నమోదు చేసుకుంది. ఇటీవలే నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయా విజేతలు అందరిని పిలిపించి సన్మానం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు సుకుమార్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

సీఎం ఇంట్లో సుకుమార్ 


సుకుమార్ కూతురు సుకృతి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గాంధీ తాత చెట్టు అని సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది శుకృతి. ఆ సినిమాకి గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు సాధించుకుంది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ దర్శకుడు సుకుమార్ దంపతులు, నిర్మాత యలమంచిలి రవి శంకర్. ఈ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతిని సన్మానించి అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఊహించని పరిణామం 

గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా విషయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ ఘటన బాగా వైరల్ అయింది. ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లాడు. అయితే అప్పటినుంచి అల్లు అర్జున్ కు మరియు సీఎం రేవంత్ రెడ్డికి అలానే పుష్ప సినిమా యూనిట్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయి అని అందరం ఊహించారు. కానీ గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ అవార్డు తీసుకోవటం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సుకుమార్ మరియు సుకృతిని అభినందించటం. ఇవన్నీ ఒక శుభ పరిణామం అని చెప్పాలి.

Coolie Film : హైకోర్టును ఆశ్రయించిన కూలీ చిత్ర యూనిట్, అసలు మేటర్ ఏంటంటే?

Related News

Dhoom 4 : బాలీవుడ్ కు మరో టాలీవుడ్ హీరో బలి, ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడం అవసరమా?

Prabhas Movie : జైలుకు వెళ్తారు జాగ్రత్త… ప్రభాస్ అభిమానులకు నిర్మాత వార్నింగ్

Murali Naik Biopic: జవాన్ మురళి నాయక్ బయోపిక్ .. హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్?

Coolie Film: హైకోర్టును ఆశ్రయించిన కూలీ చిత్ర యూనిట్, అసలు మేటర్ ఏంటంటే?

Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?

Big Stories

×