Dhoom 4 : తెలుగు హీరోలు ఎవరికీ అసలు బాలీవుడ్ కలిసి రావటం లేదు. అలానే ఎవరికి ఈ విషయం అర్థం కూడా కావడం లేదు. ఇప్పటికే మన టాప్ హీరోలంతా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. అందరి కెరియర్ పీక్ లో ఉన్న టైంలో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అని బాలీవుడ్ మాత్రం మనకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని ఇచ్చింది.
జంజీర్
రామ్ చరణ్ కెరియర్ తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు హిందీ కి వెళ్లి జంజీర్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కంప్లీట్ డిజాస్టర్. చాలామంది అప్పుడు రామ్ చరణ్ తేజ్ ను తక్కువ చేసి మాట్లాడారు. మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పుడు తన పర్ఫామెన్స్ తో అందరికీ సమాధానం చెప్పాడు. అప్పుడు బాలీవుడ్ మీడియా అంతా రాంచరణ్ గురించి పొగుడుతూ రాశారు.
ఆది పురుష్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పనుండే స్థాయిలోనే విడుదలైంది. అయితే హిందీ నుంచి దర్శకుడు ఓంరౌత్ వచ్చి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
వార్ 2
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో నటించారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిపారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలామందిని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీ కూడా ప్రస్తుతం కనిపించిన పరిస్థితి. తన సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కూడా నాగవంశం ఇంకా మీడియా ముందుకు రాలేదు.
ధూమ్ 4
ఒక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న విజయ్ దేవరకొండ ను రన్బీర్ కపూర్ తో పాటు ధూమ్ 4 సినిమాలో నటించిన అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ కి ఆల్రెడీ భయం మొదలైంది. గతంలో వచ్చిన లైగర్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో సినిమా అంటే కొంచెం తేడాగానే ఉంది. ప్రస్తుతానికి విజయ్ కెరియర్ అంతంత మాత్రం ఉంది మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ అంటే ఏం జరుగుతుందో అనేది అభిమానులు భయం.
Also Read: Prabhas Movie : జైలుకు వెళ్తారు జాగ్రత్త… ప్రభాస్ అభిమానులకు నిర్మాత వార్నింగ్