E-Paper
Advertisement

Jr NTR: ఫ్యాన్స్ హంగామా.. ఎన్టీఆర్ కళ్ల ముందే ఎస్కలేటర్ ధ్వంసం, తృటిలో తప్పిన ప్రమాదం

Jr NTR: ఫ్యాన్స్ హంగామా.. ఎన్టీఆర్ కళ్ల ముందే ఎస్కలేటర్ ధ్వంసం, తృటిలో తప్పిన ప్రమాదం
Advertisement

Jr NTR:  టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా అభిమానుల సందడి కనిపిస్తుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ఒక్కసారిగా ఉద్రిక్తత..!

ఎన్టీఆర్‌ను దగ్గరగా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలో భారీగా జనసందోహం ఏర్పడింది. కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ దగ్గరకు చేరుకోవాలని ముందుకు రావడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

Advertisement

ఈ సమయంలో అక్కడ ఉన్న ఎస్కలేటర్‌పై కూడా చాలా మంది ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఎక్కువ మంది ఎక్కడంతో ఎస్కలేటర్ దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో అక్కడ కొంత భయం నెలకొంది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగకుండా తప్పింది.

Advertisement

ఈ ఘటన ఎన్టీఆర్ కళ్ల ముందే జరిగింది. ఆ పరిస్థితిని చూసిన ఆయన కొంతసేపు వెనక్కి తిరిగి చూశారు. అభిమానుల ఉత్సాహం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.

అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. తర్వాత కార్యక్రమం సాధారణంగా కొనసాగింది. ఇక ఈ ఈవెంట్ స్పీచ్ లో పలు విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఉమెన్స్ డే గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే రోడ్ సేఫ్టీ గురించి కూడా మాట్లాడారు. ఇక గతంలో అభిమానులు ఇలా ప్రవర్తించడంతో ఒకసారి తన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు జరిగిన విషయంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా లేదా చూడాలి.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో.. పాన్ ఇండియా పరంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరో పక్క దేవర రెండో భాగం షూటింగ్ కూడా త్వరలోనే మొదలవ్వనుండి అని వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ: Vallabhaneni Anil Kumar: జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ ప్యానెల్ ఘన విజయం

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×