Nag Ashwin: ‘మహానటి’ లాంటి క్లాసిక్, ‘కల్కి 2898 AD’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌తో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘కల్కి 2’ సినిమా పనులు వేగంగా సాగుతుండగా, మరోవైపు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (94) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Read also-టీడీపీ వీరాభిమాని సత్యనారాయణ కోరిక.. కలుద్దామని సీఎం చంద్రాబాబు ట్వీట్
మెట్లపై కూర్చొని..
ఈ ఈవెంట్‌కు విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్టేజ్ ముందు దిగ్గజాలు కమల్ హాసన్, సింగీతం శ్రీనివాసరావు తదితరులు సోఫాలో ఆసీనులై ఉండగా.. కోట్ల రూపాయల బిజినెస్ చేసే టాప్ డైరెక్టర్, ఈ సినిమా నిర్మాత అయిన నాగ్ అశ్విన్ మాత్రం ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కింద మెట్లపై సాధారణ వ్యక్తిలా కూర్చున్నారు.
అంతేకాకుండా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారిని వేదికపైకి పిలిచినప్పుడు, నాగ్ అశ్విన్ ఎంతో వినయంగా ఆయన వీల్‌చైర్‌ను స్వయంగా నెట్టుకుంటూ స్టేజ్ పైకి తీసుకువచ్చారు. కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఒక గ్లోబల్ డైరెక్టర్, ఇంతటి స్టార్‌డమ్ ఉండి కూడా ఇంత సాదాసీదాగా కనిపించడం అక్కడికి వచ్చిన వారితో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరిచింది.
Read also-ఐటీ హబ్‌లో విషాదం.. ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య!
నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినిమా లవర్స్ నాగ్ అశ్విన్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. “ప్రపంచాన్ని ఊపేసిన ‘కల్కి’ తీసిన డైరెక్టర్ ఇంత సింపుల్‌గా ఉండటం అద్భుతం”, “సింప్లిసిటీకి నిలువెత్తు రూపం నాగ్ అశ్విన్”, “పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం చూస్తే ముచ్చటేస్తోంది” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక వైపు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే, మరోవైపు సినిమాపై ఉన్న ప్యాషన్‌తో, పెద్దల పట్ల వినయంతో నాగ్ అశ్విన్ ప్రవర్తించిన తీరు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. టోటల్ మ్యూజికల్ ఫాంటసీగా రాబోతున్న ఈ ‘సింగ్ గీతం’ సినిమాపై కూడా నాగ్ అశ్విన్ ప్రమోషన్స్‌తో అంచనాలు భారీగా పెంచేస్తున్నారు.
అంత సింపుల్ గా ఎలా ఉండగలుగుతారో..@nagashwin7 pic.twitter.com/rPqwH0hp1w
— Babu manchala (@manchalababu03) June 7, 2026