BigTV English

Lunar Eclipse 2025: 3 ఏళ్ల తర్వాత అతి పెద్ద చంద్రగ్రహణం.. ఇండియాలో ఎప్పుడు కనిపిస్తుంది ?

Lunar Eclipse 2025: 3 ఏళ్ల తర్వాత అతి పెద్ద చంద్రగ్రహణం.. ఇండియాలో ఎప్పుడు కనిపిస్తుంది ?


Lunar Eclipse 2025: దేశ వ్యాప్తంగా  సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. 2022 తర్వాత భారతదేశంలో కనిపించే అతి పొడవైన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. ఈ అద్భుత ఖగోళ దృశ్యం జూలై 27, 2018 తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కనిపించడం ఇదే మొదటిసారి. ఈ దృశ్యాన్ని చూడటానికి  ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్రహణం సమయం:


ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) పబ్లిక్ ఔట్రీచ్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ (POEC) చైర్‌పర్సన్ దివ్య ఒబెరాయ్ ప్రకారం.. ఈ గ్రహణం అనేక దశలలో సంభవిస్తుంది.

పెనుంబ్రల్ గ్రహణం ప్రారంభం: సెప్టెంబర్ 7న రాత్రి 8:58 గంటలకు పెనుంబ్రల్ గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ దశలో చంద్రుడు భూమి యొక్క మసకబారిన బయటి నీడలోకి (పెనుంబ్రా) ప్రవేశిస్తాడు. ఈ దశను నేరుగా కళ్ళతో చూడటం కష్టం. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ అవసరం.

పాక్షిక గ్రహణం ప్రారంభం: రాత్రి 9:57 నుంచి పాక్షిక గ్రహణాన్ని చూడొచ్చు. ఈ సమయంలో చంద్రుడు భూమి యొక్క లోపలి చీకటి నీడ (అంబ్రా) లోకి ప్రవేశించడం వల్ల దానిలో కొంత భాగం మాత్రమే చీకటిగా కనిపిస్తుంది.

సంపూర్ణ గ్రహణం: అత్యంత అద్భుతమైన సంపూర్ణ గ్రహణం రాత్రి 11:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 12:23 వరకు ఉంటుంది. దీని మొత్తం వ్యవధి 82 నిమిషాలు. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళిపోయి, ఆకర్షణీయమైన రాగి ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని మనం సులభంగా చూడవచ్చు.

గ్రహణం ముగింపు: పాక్షిక దశ తిరిగి మధ్యాహ్నం 1:26 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 2:25 గంటలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది.

గ్రహణాలు ఎందుకు అరుదు ?

చంద్ర గ్రహణం ప్రతి పౌర్ణమి నాడు సంభవించదు. దీనికి కారణం చంద్రుని కక్ష్య సూర్యుని చుట్టూ భూమి కక్ష్యకు 5 డిగ్రీల కోణంలో వంగి ఉండటమే. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మాత్రమే గ్రహణం సంభవిస్తుంది. చంద్ర గ్రహణం అనేది భూమి సూర్యుడు, చంద్రుని మధ్యకు వచ్చి.. చంద్రునిపై దాని నీడను వేసినప్పుడు ఏర్పడుతుంది.

సురక్షితమేనా ?

సూర్య గ్రహణంలా కాకుండా.. చంద్ర గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. దీనిని నేరుగా నగ్న కళ్ళతో లేదా బైనాక్యులర్లు, టెలిస్కోప్ వంటి వాటితో చూడొచ్చు. ఏ భయం లేకుండా ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

మళ్లీ చంద్రగ్రహణం ఎప్పుడు?

ఈ గ్రహణం తర్వాత మరో సంపూర్ణ చంద్రగ్రహణం కోసం భారతీయులు చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం డిసెంబర్ 31, 2028 నాడు మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి.. ఈ సెప్టెంబర్ 7న జరగబోయే ఈ అరుదైన, సుదీర్ఘమైన చంద్రగ్రహణాన్ని తప్పక చూడండి.

Related News

Indigo Flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 180 మందికి పైగా ప్రయాణికులు

Bihar Bidi: బీహారీల బీడీ.. ఆ పోలికతో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్.. అసలే ఎన్నికల సమయం!

GST Reforms: వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అందుకే సాధ్యం కాదు -నిర్మలా సీతారామన్

Mumbai High Alert: గణేష్ నిమజ్జనం సందర్భంగా బాంబు బెదిరింపు.. నగర వ్యాప్తంగా హై అలర్ట్

Russian Oil: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు

Big Stories

×