Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ఇటీవల కాలంలో కెరియర్ పరంగా ఇండస్ట్రీలో సొంత బిజీగా గడుపుతున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన నాగచైతన్య (Nagachaitanya) వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చారు.ఇలా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న నాగచైతన్య ఇటీవల తండేల్(Thandel) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇక ఈ జోష్ లోనే తదుపరి వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక చైతన్య వ్యక్తిగత విషయానికి వస్తే సమంతను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభిత(Sobhita)తో ప్రేమలో పడటం ఇటీవలే తనని పెళ్లి చేసుకోవడం జరిగింది.
అరుణ్ బ్రేక్ చెయ్యం..
ప్రస్తుతం నాగచైతన్య శోభిత వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య వారి వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభితతో పెళ్లి తర్వాత ఇద్దరం కూడా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అయ్యామని తెలిపారు. అయితే ఇలా సినిమాలు , సిరీస్ లు అంటూ బిజీగా గడపడమే కాకుండా మాకంటూ కొంత సమయాన్ని కేటాయించుకున్నామని, ఇలా మా జీవితంతో పాటు కెరీర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
జ్ఞాపకంగా ఆ క్షణాలు..
ఇక శోభిత తాను ఇద్దరు కొన్ని రూల్స్ పెట్టుకున్నామని ఖచ్చితంగా ఆ రూల్స్ పాటిస్తామని తెలిపారు. మేము హైదరాబాదులో ఉండి షూటింగ్
పనుల నిమిత్తం ఎక్కడికి వెళ్లినా ప్రతిరోజు ఉదయం రాత్రి ఇంట్లోనే కలిసి భోజనం చేయాలి. ఈ రూల్ అసలు బ్రేక్ చేయమని నాగచైతన్య తెలిపారు. ఇక సండే వచ్చింది అంటే ఆ రోజు ఇతర పనులు ఏవి పెట్టుకోమని ఆరోజు మేము మాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తామని తెలిపారు. సండే ఇంట్లో ఉంటే సినిమాలకు వెళ్లడం లేదా షికారులకు వెళ్లడం ,ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసుకుంటూ తినడం వంటి పనులన్నీ చేసుకుంటామని తెలిపారు.
ఇష్టమైన రియల్ లైఫ్ హీరో..
ఇక సినిమా షూటింగ్స్ లేకపోతే వెకేషన్ ప్లాన్ చేస్తామని తెలిపారు. నాకైతే రైసింగ్ అంటే చాలా ఇష్టం తనకు బుక్స్ చదవడం అంటే ఇష్టమని శోభిత అభిరుచుల గురించి కూడా తెలిపారు. కెరియర్ పరంగా మాకు సరైన సమయం లేకపోవడంతో ఉన్న ఆ సమయాన్ని ఎంతో జ్ఞాపకంగా మార్చుకుంటామని నాగచైతన్య వెల్లడించారు. సినిమాల పరంగా అయితే తన తాతయ్య తండ్రి నచ్చిన హీరోలని తెలిపారు. కానీ రియల్ లైఫ్ హీరోల గురించి మాట్లాడాల్సి వస్తే మా కుటుంబం మొత్తం రతన్ టాటా గారికి పెద్ద అభిమానులని తెలిపారు. ఈ విధంగా నాగచైతన్య శోభితతో వైవాహిక జీవితం గురించి వారి విషయాల గురించి మాట్లాడటంతో నాగచైతన్య విషయంలో నాగార్జున(Nagarjuna) ప్రమేయం ఏమీ లేదని పూర్తిగా శోభితతో తన జీవితాన్ని తనకు నచ్చినట్టు గడుపుతున్నారని స్పష్టమవుతుంది.
Also Read: నా నటన చూసి డైరెక్టర్ బూతులు తిట్టాడు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి?