Keerthi Suresh: కీర్తి సురేష్(Keerthi Suresh) ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తే కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవలే తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil)అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను కొట్టి పారేస్తూ కీర్తి సురేష్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇక ఈమె నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తదుపరి ఎలాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించకపోయినా, చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు.
ఉప్పుకప్పురంబు…
ఇలా చిరంజీవికి చెల్లెలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఉప్పుకప్పురంబు(Uppu Kappurambu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 4వ తేదీ థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాలో కలర్ ఫోటో హీరో సుహాస్(Suhas) నటించిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
మొదటి సినిమా విషయంలోనే..
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కీర్తి సురేష్ తన కెరియర్ తొలినాళ్ల గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కొన్ని నియమ నిబంధనలు తెలియకపోవడంతో దర్శక నిర్మాతలు సెలబ్రిటీలపై కోప్పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఇలా ఎంతోమంది దర్శకుల చేత చివాట్లు తిన్నవారు ఉన్నారు, తన్నులు తిన్నవారు కూడా ఉన్నారు. కీర్తి సురేష్ కూడా డైరెక్టర్ చేత తిట్లు తిన్నారని తాజాగా వెల్లడించారు. ఈమె మలయాళంలో మొట్టమొదటిసారి గీతాంజలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మానిటర్ చూసుకో పో..
ఈ సినిమాకు డైరెక్టర్ ప్రియదర్శన్(Priyadarshan) దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని తిట్టినట్లు ఈమె తెలిపారు. ఒక షాట్ పూర్తి అయిన తర్వాత డైరెక్టర్ వచ్చి ఎలా నటించావు తెలుసా.. ఒకసారి వెళ్లి మానిటర్ చూసుకో పో.. అంటూ అందరి ముందు గట్టిగా అరిచారు. అలా అనేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేసిందని ఆ సమయంలో ఏడ్చానని కీర్తి సురేష్ తెలియజేశారు. ఆయన కేవలం నన్ను మాత్రమే కాదు తనతో పని పనిచేసే సెలబ్రిటీల విషయంలో ఇలాగే ఉంటారని కీర్తి సురేష్ తెలిపారు. ఇప్పుడు మాత్రం అలా డైరెక్టర్లతో తిట్లు తినడం లేదని, వారికి కోపం వచ్చేలోపు నేను వారు చెప్పిన విధంగా నటిస్తున్నాను అంటూ కీర్తి సురేష్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇక కీర్తి సురేష్ త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయబోతున్నారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.
Also Read: మహేష్ సినిమా ఇష్టం లేదన్న నటి.. డైరెక్టర్ బలవంతం చేశారా?