Naga Vamsi: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేయడం తగ్గించారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు. ఇప్పుడైతే ఆన్లైన్ లో టికెట్లు దొరుకుతున్నాయి కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ దొరకడమే అదృష్టం. హరిహర వీరమల్లు సినిమా టైంలో కూడా ఓపెనింగ్స్ తో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది.
అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు విజయ్ దేవరకొండకు చాలా ప్రశంసలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ అప్పట్లో విజయ్ దేవరకొండను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చారు. అంటే ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది అనే ఉద్దేశంతో. అయితే కొంతమంది దీనిని కంటిన్యూ అయ్యారు. ఇక రీసెంట్ గా కింగ్డమ్ చిత్ర యూనిట్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ కు వెళ్లి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్నారు.
మాకు ఈయనే పవన్ కళ్యాణ్
కింగ్డమ్ సినిమా నేడు రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది. దీంట్లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ… మేము రాయలసీమలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశాం. కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ప్లాన్ చేశాం. అలానే ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
ఎక్కడ చేయాలా అని ఇంకా మేము డిసైడ్ కాలేదు. అంటూ తెలిపారు. పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలుస్తారా అని అడిగితే, లేదు మాకు ఈయనే పవన్ కళ్యాణ్ అంటూ విజయ్ దేవరకొండ ని చూపించారు. ఆఖరికి నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్ తో విజయ్ ను పోల్చారు. నాగ వంశీ ఈ మాటలను చాలా జోక్ గా చెప్పారు. అయితే దీనిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. నాగ వంశీ చెప్పిన మాటలను నార్మల్ గా వదిలేస్తారా.? వీటిని కూడా సీరియస్ గా తీసుకొని ట్విట్టర్లో వార్ మొదలు పెడతారా.? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బీభత్సమైన బుకింగ్స్
ఈ సినిమా మొదలైనప్పటినుంచి మంచి హైట్ క్రియేట్ చేశాడు నాగ వంశీ. అలానే అనిరుద్ తన మ్యూజిక్ తో ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ సినిమాకి ఉండడంతో, సినిమాకి బీభత్సమైన బుకింగ్స్ వచ్చాయి. సినిమాకి టాక్ కూడా కలిసి రావడంతో, మంచి కలెక్షన్స్ నమోదు చేసుకుంటున్నాయి.
Also Read: Naga vamsi: కొందరు కావాలనే నెగిటివ్ రాస్తున్నారు, మరోసారి కౌంటర్ ఇచ్చిన నాగ వంశీ