KL Rahul – KKR : సాధారణంగా ఐపీఎల్ లో ఆటగాళ్లు ప్రతీ సంవత్సరం మారుతుంటారు. ఒక సంవత్సరం ఈ టీమ్ లో ఆడితే.. మరో సంవత్సరం మరో టీమ్ లో ఆడుతుంటారు. కొన్ని సందర్భాల్లో టీమ్ యాజమాన్యం తప్పించడం.. మరికొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు వెళ్లిపోవడం ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు KL రాహుల్ ను ట్రేడ్ డీల్ ద్వారా కొనుగోలు చేయాలని కోల్ కతా నైట్ రైడర్స్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడిన రాహుల్ 13 మ్యాచ్ ల్లో 539 పరుగులు చేశాడు.
Also Read : Ind Vs Eng 5th Test: నేడు కీలక మ్యాచ్.. టీమ్ ఇండియాలో మార్పులివేనా… ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే ?
శ్రేయాస్ ని వదులుకున్నాక.. కష్టాలే
బాలీవుడ్ నటుడు షా రూఖ్ సహ యాజమాన్యంలోని ఫ్రాంచైజీ ఇప్పటికే కే.ఎల్. రాహుల్ పై ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అయితే 2025 సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ ని వదులుకున్న తరువాత కోల్ కతా నైట్ రైడర్స్ కి సరైన కెప్టెన్సీ ఎంపిక లేకుండా పోయింది. ఐపీఎల్ 2025 సీజన్ లో కేకేఆర్ కెప్టెన్ రమానే వ్యవహరించగా.. అతని కెప్టెన్సీలో ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేకపోయింది. దీంతో రాహుల్ ని తీసుకొని కెప్టెన్సీ చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ లో కెప్టెన్ గా రాహుల్ కి మంచి అనుభవం ఉంది. అలాగే కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో కూడా రాహుల్ కి మంచి సంబంధాలున్నాయి. ఇది ఈ ట్రేడ్ కు ఓ ముఖ్యమైన కారణంగా చెబుతున్నారు. రాహుల్ స్వయంగా తన వైబ్ బాల్ క్రికెట్ లో అభిషేక్ నాయర్ తో చేసిన కృషి దోహద పడిందని గతంలో చెప్పాడు.
డీసీ ఒప్పుకుంటుందా..?
ఈ క్రమంలో రాహుల్ ను వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకుంటుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2025 కోల్ కతా నైట్ రైడర్స్ ఆటతీరు దారుణంగా ఉంది. ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచింది. 2024లో జట్టును విజేతగా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ ను వదులుకోవడం.. రూ.23.75 కోట్లకు వెంకటేష్ అయ్యర్ ని కొనుగోలు చేయడం.. ఫ్రాంచైజీకి భారీగా నష్టం కలిగించాయి. కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ వదులుకోగా.. తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ అతడినీ రూ.14కోట్లకు తీసుకుంది. కే.ఎల్. రాహుల్ ఐపీఎల్ ప్రస్థానం చూసుకుంటే అతను ఐపీఎల్ పలు జట్లకు ఆడాడు. 2013- 2016 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి 2014, 2015లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2018 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2022-24 మధ్య లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడాడు. ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్ల ట్రేడ్ విండో ఈ ఏడాది చివరిలో రిలీజ్ అవుతుంది. కే.ఎల్. రాహుల్ ఢిల్లీలో కొనసాగుతాడో.. లేక కేకేఆర్ లోకి వెళ్తాడో వేచి చూడాలి మరీ.