IRCTC Rs80 Meal: ప్రతి రోజూ లక్షల మంది రైలు ప్రయాణికులు ఇస్తున్న ఒకేఒక్క ఫిర్యాదు.. భోజనం బాగాలేదు. రైల్వే ప్రయాణంలో సంతృప్తికర ప్రయాణం సాగుతున్నప్పటికీ ఆ తీరున ఆహారం అందడం లేదన్నది ప్రయాణికుల ఆరోపణ. కేంద్ర రైల్వే బోర్డు సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, ప్రయాణికుల నుండి వచ్చే ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం భోజన సంబంధించినవే. అంటే, తక్కువ నాణ్యత గల ఆహారం, అధిక ధరలు ప్రధాన సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో IRCTC ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదే అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపి ప్రయాణికులకు నాణ్యమైన భోజనం ఇకపై అందించనుంది.
అక్షయ పాత్రతో కలిసి భక్తితో.. భోజనంతో..
అక్షయ పాత్ర ఫౌండేషన్‌ను మిడ్‌డే మీల్ పథకంలో భాగంగా పాఠశాలలకు భోజనం అందించే సంస్థగా మనం చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే స్థాయి హైజీన్, న్యూట్రీషన్, పెద్ద స్థాయిలో తయారీ సామర్థ్యాన్ని రైల్వే ప్రయాణికులకూ అందించబోతున్నారు. IRCTC లక్నో ప్రాంతీయ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా ప్రకారం, ఈ కొత్త ప్లాన్ స్వాతంత్ర్య దినోత్సవం 2025కు ముందు ప్రారంభమవుతుంది.
ప్లాస్టిక్ కాదు.. పచ్చదనం ముఖ్యం!
ఈ పథకం కేవలం సౌకర్యవంతమైన భోజనం ఇచ్చే ప్లాన్ మాత్రమే కాదు. ప్రతి ప్లేట్ కార్న్ ఫ్లోర్ తో తయారు చేసిన ఎకో – ఫ్రెండ్లీ ప్లేట్ మీదే వడ్డించబడుతుంది. అంటే పర్యావరణానికి హానీ కలిగించకుండా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నంలో రైల్వే మరో అడుగు ముందుకేసింది.
రూ.80కే బ్రహ్మాండమైన భోజనం!
ప్రముఖ హోటళ్ల స్థాయిలో కాకపోయినా, కేవలం రూ.80కే అందే ఈ భోజనం ఆరోగ్యంగా, తృప్తికరంగా ఉండేలా ప్లాన్ చేశారు. ప్రయాణంలో ఉన్నవారికి సమతుల్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్లేట్‌లో 200 గ్రాముల వాయిదా అన్నం, 2 చపాతీలు, 150 గ్రాముల పప్పు, 100 గ్రాముల మిక్స్ డ్రై వెజిటబుల్, 10 గ్రాముల ఊరగాయ ఉంటాయి.
రుచికి తోడు పోషక విలువలు కూడిన ఈ భోజనం కడుపు నింపేంత పరిమాణంలో ఉంటుంది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ముందస్తుగా IRCTC ఈ-కేటరింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇంతకీ హైజీన్, పోషణ, ధర అన్నింటిలోనూ బ్యాలెన్స్ ఉండేలా చేసిన ఈ ప్లేట్‌ని ఓసారి రుచి చూడండి.
Also Read: IRCTC Tirumala package: IRCTC ఆఫర్.. తిరుమలకు స్పెషల్ టూర్ ప్యాకేజ్.. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి!
ఏ రైళ్లు? ఏ స్టేషన్లు?
ప్రారంభ దశలో రోజు 100 ప్లేట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది ప్రయాణికుల స్పందన ఆధారంగా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ఎంచుకున్న రైళ్లు, స్టేషన్లలోనే అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు. అంతవరకూ.. రైలు ఎక్కే ముందు ఓసారి IRCTC ఈ – కేటరింగ్ యాప్ చెక్ చేయండి, కావలసిన ముందస్తు బుకింగ్ కూడా చేయవచ్చు.
బేస్ కిచెన్ ప్లాన్‌లకు గుడ్‌బై?
ఇదివరకు లక్నోలో 10,000 ప్లేట్ల సామర్థ్యం గల పెద్ద బేస్ కిచెన్ నిర్మాణానికి రైల్వే ప్రణాళికలు రచించినా, భూసమస్యల కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు అక్షయ పాత్ర ప్రాజెక్ట్ విజయవంతం అయితే ఆ భారీ బేస్ కిచెన్ ప్రణాళిక పూర్తిగా తుడిపాటయ్యే అవకాశముంది.
ఒక్కటి కాదు.. సమస్యలన్నింటికీ పరిష్కారం!
రైల్వేలో భోజనానికి సంబంధించి ప్రయాణికుల అభిప్రాయాన్ని మార్చేలా ఈ ఆవిష్కరణ వేదిక సిద్ధమైంది. శుభ్రత, వెజిటేరియన్ ఆప్షన్స్, ప్లాస్టిక్ లేకుండా పర్యావరణ అనురూపంగా వడ్డించే విధానం.. అన్నింటి సమ్మేళనం ఇది. ఇకపై రైలు ప్రయాణం ఓ నమ్మకమైన, ఆరోగ్యవంతమైన అనుభూతిగా మారనుంది. సరదాగా ఓసారి జర్నీ ప్లాన్ చేసుకోండి.. ఒక్క ప్లేట్‌తో ఆరోగ్యం, అభిమానం రెండూ కాపాడుకోండి!