BigTV English

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

RGV:కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకులు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై మరో కేసు ఫైల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. గత కొన్ని రోజులుగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో నోటీసులు ఎదుర్కొంటూ.. విచారణకు కూడా హాజరవుతున్న వర్మ.. ఇప్పుడు మరో కేసులో ఇరుక్కోవడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి వర్మపై మరొకసారి కేస్ ఫైల్ చేయించింది ఎవరు? ఎందుకు? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..


వర్మపై మరో కేసు ఫైల్..

తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ మహిళ ఐపీఎస్ అంజన సిన్హా రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. దహనం వెబ్ సిరీస్ గురించి ఆమె ప్రస్తావిస్తూ.. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం అనే వెబ్ సిరీస్ లో వాడారు అంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు రామ్ గోపాల్ వర్మ.. దీంతో కేస్ ఫైల్ చేసుకున్న పోలీసులు వర్మపై ఐపీసీ 509, 468,469, 500, 120(B) ఇలా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నక్సలైట్స్ – ఫ్యూడలిస్ట్ లకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో ఈ దహనం వెబ్ సిరీస్ ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.

తన పేరును తప్పుగా చూపించారంటున్న రిటైర్డ్ ఐఏఎస్..


అంతేకాదు ఈ చిత్రాన్ని కమ్యూనిస్టు నేత రాములును ఎలా హత్య చేశారు? తన తండ్రి మరణానికి కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? అనే నిజ జీవిత సంఘటన ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ ను నిర్మించామని, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెకేక్కించామని వర్మ తెలిపారు. అయితే అంజనా మాత్రం దీనిని ఖండించారు. వర్మ చెబుతున్న మాటలలో నిజం లేదని, ఈ సినిమాలో తనను తప్పుగా చూపించారు అని ముఖ్యంగా తన పేరును అనుమతి లేకుండా వాడడం కరెక్ట్ కాదు అంటూ అంజన సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రాజకీయాలలో తల దూర్చి ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్మ..

ఇకపోతే ‘వ్యూహం’ సినిమా సమయంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు అనే నేపథ్యంలో గత ఏడాదికాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్మపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. గత నెల రోజుల క్రితం కూడా వర్మ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.అలా ఆ సమస్య నుంచి ఇంకా వర్మ బయటపడనేలేదు.. అప్పుడే మరో వివాదంలో చిక్కుకోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ కేసు నుంచి వర్మ ఎలా తప్పించుకుంటారో చూడాలి.

Related News

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం

TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే

Big Stories

×