Nagarjuna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున (Nagarjuna). ఒకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు ఒకవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ లు.. మరొకవైపు పలు యాడ్స్ చేస్తూ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నాగార్జున తోటి నటీనటులంతా స్టార్ హీరోలుగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi ), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh) వంటి హీరోలు ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటుంటే.. నాగార్జున మాత్రం హీరోగా సినిమా చేయడం లేదేంటి? అని అభిమానులు ఒకవైపు బాధపడుతున్న విషయం తెలిసిందే.
హీరోగా రీ ఎంట్రీకి సిద్ధం అయిన నాగార్జున..
ఇక దీనికి తోడు ఇటీవల ధనుష్(Dhanush ), శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కాంబినేషన్లో వచ్చిన ‘కుబేర’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈయన.. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అటు రజనీకాంత్(Rajinikanth ) ‘కూలీ’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా వరుస పెట్టి నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే..తమ అభిమాన హీరోని తెరపై హీరోగా ఎప్పుడు చూస్తామో అంటూ నిట్టూరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అభిమానుల కోరిక తీరేలా నాగార్జున ఒక సినిమా ప్రకటించబోతున్నారని సమాచారం. అయితే ఆ సినిమా ఏంటి? దాని కథ తెలిసి ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆ సినిమా రీమేక్ చేస్తానంటున్న నాగార్జున..
సినీ వర్గాలలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున ఒక రీమేక్ చేయబోతున్నట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. శశి కుమార్ (Sasikumar) నటించిన అయోతి (Ayothi ) అనే తమిళ మూవీని నాగార్జున రీమిక్స్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త తమిళనాడు సినీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆర్. మంతిర మూర్తి (R.Mantira Murti) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథా, కథనం గురించి ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ప్రేక్షకులను కథ రంగా మెప్పించడమే కాకుండా అటు కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమాను రీమేక్ చేసి హీరోగా మళ్ళీ కం బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు నాగార్జున.
ఆందోళనలో అభిమానులు..
సాధారణంగా రీమిక్స్ సినిమాలు అంటే ఆడియన్స్ భయపడుతూ ఉంటారు. దీనికి తోడు హీరోగా చాలా ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైన నాగార్జున.. మళ్ళీ ఇప్పుడు రీమేక్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా నాగార్జునకు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9)కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు. అటు కంటెస్టెంట్ ల ఎంపిక జరుగుతోందని, ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో ఈ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
ALSO READ:Prabhas: గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభాస్ పెద్దమ్మ.. ఎందుకో తెలిస్తే షాక్!