BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు ను క్షమించని ప్రభావతి .. రవికి షాకిచ్చిన శృతి.. బాలు, మీనా బయటకు వెళ్తారా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు ను క్షమించని ప్రభావతి .. రవికి షాకిచ్చిన శృతి.. బాలు, మీనా బయటకు వెళ్తారా..?

Gundeninda GudiGantalu Today episode july 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలును అడ్డుగా పెట్టుకొని ఫంక్షన్ లో పెద్ద గొడవ చేయించాలని శృతి వాళ్ల అమ్మ శోభ, తండ్రి సురేంద్ర కుట్ర పన్నుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే బాలు మొదటి నుంచే ఫంక్షన్ కు వచ్చిన సమయం నుంచి మౌనంగా ఉంటాడు. ఎవ్వరితో మాట్లాడకుండా, ఎవ్వరు ఏమన్నా సైలెంట్ గా ఉంటానని మీనాకు, తండ్రి సత్యంకు మాట ఇస్తాడు.


వాళ్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. శృతి వాళ్ల అమ్మానాన్నలు బాలుపై కుట్ర చేసినా ఏమాత్రం వారి ట్రాప్ లో పడడు. రోహిణి కూడా తన బండారం బయట పడకుండా ఉండాలని బాలును ఇరికించాలని అనుకుంటుంది. కానీ బాలు తెలివిగా తప్పించుకుంటాడు. ప్రభావతి కుటుంబం వెళ్ళేలోగా ఏదోకటి చేసి శృతిని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచుకోవాలని శోభన అనుకుంటుంది.. అందుకోసం భోజనం దగ్గర గొడవ చెయ్యాలని అనుకుంటుంది. సత్యం ను అవమానించాలని అనుకుంటారు. కానీ బాలు తెలివిగా ప్లాన్ చేస్తాడు. శృతి తన మెడలోని పూలదండను తీసి తన బెడ్ రూమ్ లో పెట్టేసి వెళ్తుంది. ఆ పూల దండకు శృతి చైన్ ఉంటుంది. అనుకోకుండా శృతి గదిలోకి వెళ్లిన మీనా పూలదండకు ఉన్న చైన్ ను చూస్తుంది. ఎవరైనా తీసుకుంటాని తానే తీసి దాచి తిరిగి ఇద్దామని అనుకుంటుంది. అది చూసిన సురేంద్ర మీనా దొంగతనం చేసిందని నానా మాటలు అంటాడు దాంతో పెద్ద గొడవ జరుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా మంచి అమ్మాయి, తనకున్న బంగారాన్నే ఇంట్లో పెట్టేసిందని, తనకు అలాంటి బుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ శృతి వాళ్ల నాన్న సురేంద్ర సత్యంపై మాటలు జారుతూనే ఉంటాడు. అంతే కాకుండా మీనాను కూడా దొంగ దొంగ అంటూ అవమానిస్తారు. ఇక మీనా గురించి తెలుసుకున్న తర్వాత కూడా బాలుపైనే ఫైర్ అవుతుంది. అందరు ఇంటికి వెళ్తారు.. శృతి రానని అంటుంది. రవిని వదిలేసి వెళ్తారు.. ఇంటికి వెళ్ళగానే ప్రభావతి బాలు పై రెచ్చిపోయి మాట్లాడుతుంది.


వాడు రాకపోతే నేను రాను అని మీరు మొండికేసుకుని కూర్చున్నారు. వాడు వస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అర్థమైందా? ఇప్పటికైనా మీకు కళ్ళు తెరుచుకొని కొడుకేంటి వాడి పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోండి అని ప్రభావతి సత్యం పై సీరియస్ అవుతుంది.. కానీ సత్యం మాత్రం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసు కదా మరి ఆ సురేందర్ గురించి మాట్లాడకుండా బాలు గురించి మాట్లాడతావా అని అరుస్తాడు.

మీనా వ్యక్తిత్వం ఏంటో నీకు తెలియదా? ఒక్క మాట అనగానే తనతో ఉన్న బంగారం మొత్తం ఒలిచి నీ చేతికిచ్చింది అలాంటి మీనా తన భర్త కోసం చైను దొంగతనం చేసిందా అని సత్యం అంటాడు. నాకు మాట్లాడించే అవకాశం ఇచ్చారా? వాడు నువ్వు రెచ్చిపోయి మాట్లాడారు. ఇంతమంది ముందర ఒక పెద్ద మనిషిని కొట్టాడు అన్న ఫీలింగ్ కూడా వాడికి లేకుండా పోయింది. వాళ్ళ బంధువులు ముందర ఆయన కొడితే ఆయన ఊరుకుంటాడా ఇక రవి శృతిని ఇంటికి పంపిస్తారా అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది.

Also Read :మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వకండి…

రోహిణి మనోజ్ కూడా బాలురే తప్పు అని అంటారు. వాడు ఏం చేసినా వాడి భార్య మీద ప్రేమతోనే చేశాడు. మనం ఎవ్వరం చేయండి వాడు చేశాడు. ఆ సురేంద్ర ఎలాంటివాడో మనకు తెలియదా? ఆఫీసులో ఎలాంటి ఫ్రాడ్ పనులు చేస్తాడో మాకు తెలుసు అలాంటి వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావా అని ప్రభావతికి గడ్డి పెడతాడు. ఏది ఏమైనా కూడా వాడి వల్ల రవి ఇంటికి రాకుండా ఉంటే నేను మాత్రం అస్సలు ఊరుకోను అని ప్రభావతి అంటుంది.

మీనా, బాలు ఇద్దరూ బయటికి వెళ్లిపోతారు.. అయితే బాలు ఒక హోటల్ దగ్గర ఆపుతాడు. ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు ఇప్పుడు కూడా ఏమి తినకపోతే చాలా నీరసంగా పడిపోతావు అని మీనాతో అంటాడు. కానీ మీనా మాత్రం నాకు ఏమి తినాలి అనిపించట్లేదు ఇప్పుడు నా మనసు మనసులో లేదు అని అంటుంది. మీరు ఇంత పెద్ద గొడవ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే మీ అమ్మ ఎంత రచ్చ చేస్తుందని నాకు బాధగా ఉంది అని మీనా అంటుంది.

నువ్వు ఆ సురేంద్ర నిన్ను అనగానే నువ్వు పక్కకెళ్ళి ఏడవకుండా వచ్చి నా గుండెల మీద పడి ఎందుకు ఏడ్చావు.. నాకు ఎక్కడ గుచ్చుకున్నట్లు అనిపించింది అందుకే అతన్ని ఎంతో ఓపిగ్గా అడిగాను ఇంకా రెచ్చగొడితే మా నాన్నను కూడా అంటే అప్పుడు కొట్టాను అంతే అని బాలు అంటాడు. ఇకపోతే మనం ఇంటికి వెళ్తే అక్కడ ప్రభావతి ఏమైనా తిననిస్తుందా? ఇంకా గొడవ చేస్తుంది దానికి ఓపిగ్గా ఉండాలి కదా.. ఇక్కడ కాస్త ఏదైనా తినేసి వెళ్దామని.

రవికి సత్యం ఫోన్ చేసి ఏంటిరా పరిస్థితి శృతి ఏమంటుంది ఇంటికి రండిరా కూర్చొని మాట్లాడుకుందాం అని అంటాడు. ఇది చాలా కోపంగా ఉంది నాన్న ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా కూడా తను మాట్లాడదు. మీనా మీద దొంగతనం వేయడం వల్లే బాలు ఆయన కొట్టాడు అని అంటాడు. ఏమో నాన్న శృతి వస్తది అని నమ్మకం నాకు లేదు నా ప్రయత్నం నేను చేస్తాను అని రవి అంటాడు. శృతి దగ్గరికి వెళ్లి రవి ఇంటికి వెళ్దాం అంటే నేను రాను అని అంటుంది. వెళ్లాలనుకుంటే వెళ్లిపోని చెప్తుంది. తర్వాత బాలు మీనా ఇంటికి వస్తే ప్రభావతి పెద్ద రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు మీనా ఇంట్లోంచి బయటికి వెళ్తారేమో చూడాలి..

Related News

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Tv Serial Actress : తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న  హీరోయిన్స్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..

Big Stories

×