Indian Railways: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. పలు చోట్ల పట్టాల మీదికి వరద నీరు వచ్చి చేరున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు పిడుగురాళ్ల-బెల్లంకొండ మధ్య బ్రిడ్జి నంబర్-59 దగ్గర వరద నీరు ప్రమాద హెచ్చరిక మార్క్ కు చేరుకుంది. అటు గుంటూరు- తెనాలి మధ్య వంతెన నంబర్-14 దగ్గర, వెజెండ్ల-మణిపురం మధ్య బ్రిడ్జి నంబర్-14 దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని లోకో పైలెట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రదేశాల్లో 30 కి.మీ./గం. వేగంతో మాత్రమే వెళ్లాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సిబ్బంది కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని, నీరు తగ్గిన తర్వాత మళ్లీ సాధారణ వేగం ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!
అటు పాపట్ పల్లి- డోర్నకల్ బైపాస్ మధ్య 3వ రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను ఐదు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది. 10 రైలు సర్వీసును ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు రైళ్ల రద్దు కొనసాగుతున్నట్లు తెలపింది. ఇంతకీ క్యాన్సిల్ అయిన రైళ్లు ఏవంటే..
⦿ రైలు నెంబర్- 67767 – డోర్నకల్- విజయవాడ
⦿ రైలు నెంబర్- 67768 – విజయవాడ- డోర్నకల్
⦿ రైలు నెంబర్ – 67765 – కాజీపేట- డోర్నకల్
⦿ రైలు నెంబర్ – 67766 – డోర్నకల్- కాజీపేట
⦿ రైలు నెంబర్ – 12713 – విజయవాడ- సికింద్రాబాద్
⦿ రైలు నెంబర్ – 12714 – సికింద్రాబాద్- విజయవాడ
⦿ రైలు నెంబర్ – 67215 – విజయవాడ- భద్రాచలం రోడ్
⦿ రైలు నెంబర్ – 67216 – భద్రాచలం రోడ్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్)
⦿ రైలు నెంబర్ – 12705 – గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్)
⦿ రైలు నెంబర్ – 12706- సికింద్రాబాద్- గుంటూరు
Read Also: ఆ టైమ్‌లో టీటీఈ.. ప్రయాణీకులను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలా చేస్తే దబిడి దిబిడే!
రైల్వే అధికారులు కీలక సూచనలు
ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం స్థానిక రైల్వే స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. ఒకవేళ ఏమైన సాయం కావాలంటే 139కు కాల్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. వీలుంటే ఇతర వివరాల కోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ లేదంటే యాప్ చూడవచ్చని తెలిపారు. ప్రయాణీకులు రద్దు అయిన రైళ్ల వివరాలను తెలుసుకుని ప్రత్యామ్నా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి పంబన్ బ్రిడ్జి పరిస్థితి ఇది, రైలు సేవలన్నీ బంద్!