E-Paper
Advertisement

అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్

అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్
Advertisement

Dayakar Goud: టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్ గౌడ్ బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు, మంత్రులను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా AI టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సీఎం ప్రతిష్టను దిగజార్చేలా వీడియోలు క్రియేట్ చేస్తున్నారని, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డిపై కూడా ఇలాంటి నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు.

అసత్య ప్రచారాలు అందించడమే వారి పని

Advertisement

బీఆర్ఎస్ నేతలు నిత్యం సమాజానికి తప్పుడు సమాచారాన్ని అందించడమే పనిగా పెట్టుకున్నారని దయాకర్ గౌడ్ విమర్శించారు. ఇటువంటి చిల్లర రాజకీయాలను వెంటనే ఆపాలని, డీజీపీతో సహా పోలీసు యంత్రాంగం ఈ ముఠాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అధికారం పోయాక దిగజారుడు రాజకీయం

Advertisement

అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ సామాన్యులను, చివరికి హీరోయిన్లను కూడా వదలకుండా వారిపై అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకుందని దయాకర్ గౌడ్ మండిపడ్డారు. నాయకులపై బురద జల్లడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

సానుభూతి పొందేందుకు ప్రయత్నం..

ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజా మద్దతు కోల్పోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి కుట్రలు చేస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని, కానీ ప్రజలు వీటిని ఎంతమాత్రం నమ్మరని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా దొంగ ముసుగులు తీసివేసి, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయాలని హెచ్చరించారు.

Also Read: రోడ్ల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆ స్వీడన్ మోడల్ కావాల్సిందే!

Tags

Related News

రోడ్ల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆ స్వీడన్ మోడల్ కావాల్సిందే!

ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!

కర్త, కర్మ, క్రియ ఆయనే.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై నిజాలు బయటపెట్టిన కవిత

 వరంగల్ జిల్లాలో విషాదం.. పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి దుర్మరణం!

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×