Nagarjuna: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)గత నాలుగు సంవత్సరాల క్రితం లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల ధనుష్ రష్మిక హీరో హీరోయిన్గా కుబేర(Kuberaa) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇక ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున కూడా పాల్గొని సందడి చేశారు.
అక్కినేని నామ సంవత్సరం..
ఇక ఈ సక్సెస్ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా నాగార్జున శేఖర్ కమ్ముల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో ధనుష్ నాగార్జున పాత్రల గురించి సినిమా నిడివి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇకపోతే ఒక రిపోర్టర్ నాగార్జునను ప్రశ్నిస్తూ .. రీసెంట్ గా నాగచైతన్య తండేల్ సినిమాతో హిట్ కొట్టారు. మీరు కూడా కుబేర సినిమాతో హిట్ అందుకున్నారు. నెక్స్ట్ అఖిల్(Akhil) లెనిన్(Lenin) సినిమాతో హిట్టు కొడతారు .బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోల హిట్ అందుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాదిని నాగ్ నామ సంవత్సరం లేదా, అక్కినేని నామ సంవత్సరం అని పిలవచ్చా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగార్జున తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం అంటూ పిలవండి అని తెలిపారు.
లెనిన్ పై నాగ్ మౌనం…
ఈ విధంగా నాగార్జున తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం అని పిలవండని చెప్పారే కానీ అఖిల్ సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు. అఖిల్ సినిమా గురించి ఈయన స్కిప్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అఖిల్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని భావించారు కానీ నాగార్జున మాత్రం అఖిల్ సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇక అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా శ్రీ లీలా నటిస్తున్నారు. ఇటీవల అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సినిమాని ప్రకటించారు. ఇప్పటివరకు దాదాపు ఐదు సినిమాలు చేసిన అఖిల్ ఏ ఒక్క సినిమాతో కూడా హిట్ అందుకోలేదు. మరి లెనిన్ తో అయ్యగారు హిట్ కొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
అరగంట సినిమాని లేపేసారా..
ఇకపోతే శేఖర్ కమ్ములను కూడా ప్రశ్నిస్తూ.. ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటల 13 నిమిషాలు ఉంది. ఎడిట్ చేసిన తర్వాతే ఇంత సమయం వచ్చింది అంటే ఎడిట్ చేయకుండా ఈ సినిమా ఇంకెంత నిడివి ఉండేది అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ.. ఎక్కువగా పాటలకు లెంత్ ఉండేదని తెలిపారు. మరో అరగంట సినిమాని ఎడిటింగ్ లో తీసేసాము అంటూ ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సమాధానం ఇచ్చారు ఈ సినిమాలో ఒక పాటను కూడా తొలగించారని తెలుస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలను కూడా తొలగించినప్పటికీ ఈ సినిమా ఏకంగా 3.13 నిమిషాల నిడివి ఉందని చెప్పాలి.
Also Read: Nagarjuna: ఏంటీ.. నాగార్జునను ఇన్ని సినిమాల్లో చంపేశారా? రాజీవ్ కనకాలకు పోటీ?