Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు, కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో హీరోగా భారీ స్థాయిలో సొంతం చేసుకున్నారు. ఇక ఈయన సోలో హీరోగా సెంచరీకి చేరువలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈయన వందవ సినిమాని త్వరలోనే ప్రకటించబోతున్నారు. అయితే హీరోగా మాత్రమే కాకుండా నాగార్జున ఎన్నో సినిమాలలో అతిథి పాత్రలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటే చేయటానికి నాగార్జున ఏమాత్రం మొహమాట పడరు. ఆ సినిమా చిన్న హీరో చేస్తున్నాడా? పెద్ద హీరో చేస్తున్నారా? అనే విషయాలను కూడా పక్కనపెట్టి ఈయన క్యామియో పాత్రల(Cameo Role) ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కుబేర…
ఇకపోతే తాజాగా కుబేర(Kuberaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్మల దర్శకత్వంలో ధనుష్ రష్మిక నటించిన ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఎంతో అద్భుతంగా ఉంది. అయితే చివరికి నాగార్జున పాత్ర చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే నాగార్జున సినిమాలలో చనిపోవడం ఇలా మొదటిసారి కాదని ఇదివరకే ఈయన ఎన్నో సినిమాలలో చనిపోయిన పాత్రలలో నటించారని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సినిమాలలో నాగార్జున చనిపోయిన విధంగా నటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
14 సినిమాలలో చంపేశారు..
మరి నాగార్జున ఏఏ సినిమాలలో చనిపోయిన పాత్రలలో నటించారనే విషయానికి వస్తే… గీతాంజలి, జానకి రాముడు, మజ్ను, అంతం, నిన్నే ప్రేమిస్తా, సోగ్గాడే చిన్నినాయన, బ్రహ్మాస్త్రం, కుబేర, బంగార్రాజు, మనం, అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న, Zakhm వంటి సినిమాలలో నాగార్జున ఎంతో కీలక పాత్రలలో నటించినా, చివరికి ఈయన పాత్ర చనిపోయినట్టు చూపించారు. ఇలా ఈ సినిమాలలో ఈయన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయని చెప్పాలి. సాధారణంగా ఏ స్టార్ హీరో తన పాత్ర సినిమాలలో చనిపోయే విధంగా ఉంటే ఒప్పుకోరు కానీ నాగార్జున ఏకంగా 14 సినిమాలలో చనిపోయినట్టు నటించారని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
రాజీవ్ చనిపోతే సినిమా హిట్టే…
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఫన్నీగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇలా చనిపోయిన పాత్రలలో నటించడంలో నాగార్జున మరొక నటుడు రాజీవ్ కనకాలను(Rajeev Kanakala) మించిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజీవ్ కనకాల కూడా గత కొంతకాలంగా ఏ సినిమాలో నటించిన ఆ సినిమాలో తన పాత్రను చంపేస్తున్న విషయం తెలిసిందే. ఇలా తన పాత్రను చంపేసి, ఆయన ఫోటోకి దండం పెడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అందుకే రాజీవ్ పాత్రను చంపేస్తూ ఉంటారు. ఇలా చనిపోయిన పాత్రలలో నటించడంలో ప్రస్తుతం నాగార్జున రాజీవ్ కనకాలను కూడా వెనక్కి నెట్టడంతో ఇంకెన్ని సార్లు మా హీరోని సినిమాలలో చంపేస్తారు అంటూ అభిమానులు రియాక్ట్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Actress Sada: ఇంట్లో 16 అడుగుల తాచుపాము.. సదా ఏంటా ధైర్యం? ఒళ్లు జలదరించే వీడియో