Hair Growth Tips: ప్రతి వారి అందంలో జుట్టు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు అనేది అమ్మాయి, అబ్బాయి ఇద్దరికి ఎంతో ముఖ్యమైనది. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది. పోషకాహారం లోపం, కాలుష్య ప్రభావం వల్ల జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఒక్కసారి జుట్టు రాలడం స్టార్ట్ అయితే ఆపడం చాలా కష్టం అవుతుంది.
పోషకాహార లోపం:
ఇక మన ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మనం తినే ఆహారమే మన శరీరానికి పోషకాలను అందిస్తుంది. అయితే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియం ఎంత ముఖ్యమే.. కళ్లు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ ఎ ఎంత అవసరమో జుట్టు పెరగడానికి కూడా పోషకాలు అంతే ముఖ్యం.. ముఖ్యమైన పోషకాల్ని డైట్‌లో భాగం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టును పొడువుగా, ఒత్తుగా, ధృఢంగా మార్చుకోవాలనుకుంటే.. ఈ ఐదు ఆహారాల్ని డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు:
ఆకుకూరలలో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకుకూరల్లో ఆస్కార్బిక్ యాసిడ్‌తో పాటు ఫోలిక్ యాసిడ్, టోకోఫెరోల్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగదలను ప్రోత్సాహిస్తాయి. బచ్చలికూర, మెంతి కూర, పాలకూర, కరివేపాకు, తోటకూర, కొత్తిమీర, పుదీనా, చాప, పట్టగొడుగులు, గుడ్లు వంటివి తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పప్పులు, దుంపలు:
ప్రొటీన్, జింక్ పుష్కలంగా ఉండే గింజల్ని డైట్‌లో చేర్చుకోవాలి. బాదం, వాల్‌నట్స్, పోద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. కాపర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే వాల్‌నట్స్ తినడం వల్ల జుట్టు తెల్ల రంగులోకి మారదంటున్నారు. అంతేకాకుండా వాల్‌నట్స్‌లో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్ని ఇస్తాయి. ఇక, బాదం పప్పులో ఉంటే విటమిన్ ఇ, బయోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా కీలకం. బాదం పప్పు తిన్నా సరే.. బాదం నూనె జుట్టుకు అప్లై చేసినా మంచి ఫలితాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా చిలకడదుంపలలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చుండ్రుని తొలగిస్తాయి. దీని కారణంగా జుట్టు మందంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు పొడిబారకుండా ఉంటుంది.
Also Read: ఒంట్లోని షుగర్‌ని పటాపంచలు చేసే ఒకే ఒక్క ఆకు.. ఏంటో తెలుసా?
జుట్టు పెరుగుదలకు చికెన్ కూడా సహాయపడుతుంది. చికెన్ లో ఎల్-లైసిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. చికెన్ అంటేనే లీన్ ప్రొటీన్, విటమిన్ B కూడా ఉంటుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. సాల్మన్ చేపలో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే చిక్కుళ్ళు, బీన్స్ కూడా జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇందులోని ఫొలేట్ సహా బి విటమిన్స్ జుట్టుని పొడుగ్గా చేస్తాయి.