Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ (The Paradise)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళంలో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నానితో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఒక భాష హీరో ఇతర భాషలలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే . తమిళంలో స్టార్ట్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నానికి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీరు పూర్తిస్థాయి తమిళ సినిమా ఎప్పుడు చేయబోతున్నారు ? ఒకవేళ చేస్తే ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు? అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ..
తాను గతంలోనే రెండు తమిళ సినిమాలకు కమిట్ అయ్యానని తెలిపారు. 2011వ సంవత్సరంలోనే వెప్పన్ అనే సినిమాతో పాటు 2014లో వచ్చిన ఆహా కళ్యాణం అనే సినిమాలకు ముందు తానే ఎంపిక అయ్యాను కానీ కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదని తెలిపారు. అయితే తమిళంలో రిలీజ్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేయడంతో అక్కడ మంచి సక్సెస్ అందుకున్నానని నాని తెలిపారు. ఇక త్వరలోనే తాను కూడా పూర్తిస్థాయి తమిళ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఇలా తమిళ సినిమా చేయాల్సి వస్తే మణిరత్నం(Mani Ratnam) గారి డైరెక్షన్లో సినిమా చేయడమే తన కల అంటూ నాని ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.
మరి నాని కోరుకున్న విధంగానే మణిరత్నం డైరెక్షన్ లో పూర్తిస్థాయి తమిళ సినిమా చేయగలరా? మణిరత్నం గారు ఆ అవకాశాన్ని కల్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక నాని ప్రస్తుతం నటించిన ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని నాని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా ద్వారా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!