Actor Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం పలు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు నాని చిత్ర దర్శకుడు నిర్మాతలతో కలిసి ములుగు జిల్లాలోని ఉదయం గట్టమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదేవిధంగా మేడారంలో కొలువైయున్న వనదేవతలు సమ్మక్క(Samakka) సారలమ్మ(Saralamma)ని కూడా చిత్ర బృందం దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.
మేడారం చేరుకున్న చిత్ర బృందానికి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం గద్దెల ప్రాంతానికి చేరుకున్న చిత్ర బృందానికి ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ఇక నానితో పాటు చిత్ర బృందం అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెలను సమర్పించారు. ఇలా మొక్కు చెల్లించుకున్న అనంతరం నిర్మాత సుధాకర్ తో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) నాని సైతం నిలువెత్తు బెల్లం అమ్మవారికి కానుకగా సమర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో నాని తల్లి పాత్ర సమ్మక్క అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సమ్మక్క అంటూ సాగిపోయే పాట ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా సమ్మక్క సారలమ్మను దర్శించడం కోసం నానితో పాటు చిత్ర బృందం వస్తున్నారనే విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.
Natural Star @NameisNani & #TheParadise team offered their prayers at the Sri Sammakka Saralamma Devasthanam in Medaram ✨
Book your tickets now!
🎟️ https://t.co/XTkG9ueWdvNatural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼@themohanbabu… pic.twitter.com/OcOwbNMErD— SLV Cinemas (@SLVCinemasOffl) September 29, 2026
ఇక ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే… ఈ సినిమా విడుదల తర్వాత పెద్ద ఎత్తున ఈ సినిమాపై నెగెటివిటీ క్రియేట్ చేసినప్పటికీ ఈ నెగెటివిటీని తట్టుకొని ఈ సినిమా భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. మొదటి రోజే రూ. 88 కోట్ల ఓపెనింగ్ రాబట్టి నాని కెరియర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ రాబడిన సినిమాగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా పొలిటికల్ పరంగా పలు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గలేదని చెప్పాలి .ఇప్పటికి హౌస్ ఫుల్ తో షోలు రన్ అవుతున్నాయి. ఇక నాని ఈ సినిమా పూర్తి చేయడంతో తదుపరి డైరెక్టర్ సుజిత్ తో చేయబోతున్న బ్లడీ రోమియో(Bloody Romeo) సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి ఈ సినిమా అక్టోబర్ రెండో వారం నుంచి షూటింగ్ పనులను జరుపుకోబోతుందని సమాచారం.
Also Read: డీజే సౌండ్స్ పై శిరీష్ ఫిర్యాదు… అల్లు అర్జున్ పై భారీ ట్రోల్స్!