Krish Jagarlamudi: గమ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు క్రిష్ జాగర్లమూడి. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా డీసెంట్ సక్సెస్ సాధించుకుంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. గమ్యం సినిమా తర్వాత చేసిన వేదం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటించిన ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అసలు అనుష్క పాత్రలో ఊహించడమే కష్టం అనుకుంటే, తనను ఒప్పించి మరీ సినిమాలో పెట్టాడు క్రిష్. ఆ తర్వాత చేసిన కృష్ణం వందే జగద్గురు సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. కంచె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి కూడా బాగానే ఉంటుంది. అయితే క్రిష్ కి అసలు గండం ఇక్కడి నుంచి మొదలైంది.
చైనా లాగా ఇక్కడ సాధ్యమవుతుందా.?
క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లు అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఆ సినిమాకి కొంతమేరకు మాత్రమే క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా వ్యవహరించాడు. ఇక అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా వచ్చిన సిరీస్ అరేబియన్ కడలి. నాగచైతన్య తండెల్ సినిమా కథ నే సిరీస్ గా తరికెక్కించారు. ఇది కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇక రీసెంట్ గా క్రిష్ జాగర్లమూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. చైనా దేశంలో ఉన్నట్లు చాలా థియేటర్స్ రావాలి. ఇంటి నుంచి బయటకు వస్తే పది నిమిషాలు దూరంలో థియేటర్ ఉండేటట్లు ఉండాలి. కారు తీయకుండా పది నిమిషాల్లో థియేటర్ చేరిపోయి వచ్చేటట్లు ఉండాలి. కారు తీసి పార్కింగ్ చేసి, థియేటర్ కి వెళ్లి పాప్కార్న్ కొనుక్కొని అలాకాకుండా, ఇంటి దగ్గర భోజనం చేసి బయటకెళ్ళి సినిమా చూసి వచ్చేటట్లు ఉండాలి అంటూ మాట్లాడారు.
ఉన్న థియేటర్లకే దిక్కులేదు
చాలామంది గమనించని ఒక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సినిమా షోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. రెండేళ్లకి ఒకసారి వచ్చే పెద్ద సినిమా కోసం మాత్రమే ఆడియన్స్ థియేటర్ కి వెళ్తున్నారు. ఒక సినిమా కోసం ఆత్రుతిగా వెయిట్ చేసి థియేటర్ కు పరిగెడుదాం అని మైండ్ సెట్ లేకుండా పోయింది. గట్టిగా మాట్లాడితే ఒక నెల రోజులు ఆగితే అదే సినిమా ఇంటికి వచ్చేస్తుంది కదా అని ఒపీనియన్ కి చాలామంది ఆడియన్స్ వచ్చేసారు. ఇటువంటి తరుణంలో థియేటర్ బిజినెస్ లోనికి దిగాలంటేనే చాలామంది భయపడుతున్నారు. స్టార్లు విరివిగా సినిమాలు చేస్తే గాని థియేటర్లకి మళ్లీ పూర్వవైభవం రాదు అని చెప్పడానికి ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలే ఉదాహరణ.
Also Read: Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది