Thug Life Ott Streaming: లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా నటించిన తాజా చిత్రం “థగ్ లైఫ్”(Thug Life). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ జూన్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటే మరో “నాయకుడు” తరహాలో ఈ సినిమాని ఊహించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో నాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మరోసారి థగ్ లైఫ్ రావడంతో అదే స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది.
థియేటర్లో డిజాస్టర్…
ఇక ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కొంది. ఇకపోతే ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు తిరిగి ఓటీటీలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు నెల వ్యవధి కూడా లేకుండానే ఓటీటీలో ప్రసారమవుతున్నాయి. తాజాగా కమల్ హాసన్ నటించిన ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదలై నెల కూడా కాకుండానే సైలెంట్ గా ఓటీటీలో ప్రసారమౌతోంది.జూలై 2 అర్దరాత్రి తర్వాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Net Flix) లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ అందుబాటులోకి వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ లో విడుదల…
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల విషయాన్ని స్వయంగా నెట్ ఫ్లిక్స్ సౌత్ ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ..ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ సినిమాను ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో చూడండి అంటూ అధికారకంగా ప్రకటించారు. మరి థియేటర్లలో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడైనా హిట్ కొట్టేనా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష(Trisha) శింబు(Simbu) వంటి సెలబ్రిటీలు కూడా నటించిన విషయం తెలిసిందే.
Ithu Rangaraya Sakthivel-kum yamanukum nadakura poti 🔥😎
Watch Thug Life, now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#ThugLifeOnNetflix pic.twitter.com/wCG2vh0zil
— Netflix India South (@Netflix_INSouth) July 2, 2025
ఇక ఈ సినిమా విడుదల సమయంలో కమల్ హాసన్ పెద్ద ఎత్తున వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. కన్నడ భాషను కమల్ హాసన్ అవమానిస్తూ మాట్లాడారని, అందుకే ఆయన సినిమా కర్ణాటకలో విడుదల కావడానికి వీలు లేదు అంటూ కన్నడిగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు చేసినప్పటికీ ఈయన మాత్రం తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెలియజేశారు. ఏది ఏమైనా వివాదాలు నడుమ ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా ఈ చిత్రం ఓటీటీలో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Samantha: కంట్రోల్ చేసుకోవటం నావల్ల కాలేదు… మూడు రోజులు అదే పనిలో సమంత!