BigTV English

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… ఒక్కోటి ఒక్కో జానర్

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… ఒక్కోటి ఒక్కో జానర్

OTT Movie : ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సరికొత్త కన్నడ సినిమాలు, తొందర్లోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ సినిమాలు ఒక్కోటి ఒక్కో జానర్ లో తెరకెక్కాయి. ఈ సినిమాలన్నీ థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక మూవీ లవర్స్ కి ఈ నెల పండగ చేసుకోవడమే ఆలస్యం. ఈ కన్నడ సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


‘హెబ్బులి కట్’ (Hebbuli Cut)

ఈ కన్నడ కామెడీ మూవీకి భీమరావు దర్శకత్వం వహించారు. ఇది సతీశ్ నీనాసం నిర్మాణ సమర్పణలో సారా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈ సినిమా 2025 జూలై 4 న థియేటర్లలో విడుదలైంది. ఇది 2017లో విడుదలైన కన్నడ చిత్రం ‘Hebbuli’ లో, కిచ్చా సుదీప్ ఐకానిక్ హెయిర్‌స్టైల్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఉత్తర కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇందులో నవనీత్ శామ్, దీపక్ యరగెర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైంది. ఈ నెలలో ఓటీటీలోకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.


‘కపట నాటక సూత్రధారి’ (Kapata Nataka Sutradhari)

ఈ పొలిటికల్ డ్రామా మూవీకి ధీరజ్ ఎం.వి. దర్శకత్వం వహించారు. ఇందులో అభిరామ అర్జున, ధీరజ్ ఎం.వి., వరుణ్ గురురాజ్, శ్రీ సాగర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రాజకీయ,మతపరమైన అంశాలతో తెరకెక్కింది. 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ ఫామ్‌లలో ఈ సినిమా త్వరలో అందుబాటులోకి రానుంది.

‘జంగల్ మంగళ్’ (Jungle Mangal)

ఈ కన్నడ లైట్-హార్టెడ్ థ్రిల్లర్ మూవీకి రక్షిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో యశ్ శెట్టి, హర్షిత రామచంద్ర, ఉగ్రం మంజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 జూలై 4న కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇది కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మల్నాడ్, కరావళి ప్రాంతాల సంస్కృతి నేపథ్యంలో, ఒక లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను 750,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 1 గంట 32 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.8/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా, ఈ నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

‘పెన్ డ్రైవ్’ (Pen Drive)

ఈ కన్నడ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ డేవిడ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాళశ్రీ, తనీషా కుప్పండ, సంజనా నాయుడు, కరి సుబ్బు, బిగ్ బాస్ ఫేమ్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2025 జూలై 4 న కర్ణాటకలోని థియేటర్లలో విడుదలైంది. RH ఎంటర్‌ప్రైజెస్, శ్రీ తిరుమల సినీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లపై N హనుమంతరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా స్టోరీ ఒక పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది.

Read Also : దెయ్యంతో పెళ్లి డీల్… ఫ్యామిలీలో వరుస హత్యలు… కలలో కూడా ఊహించని డేంజరస్ హర్రర్ స్టోరీ

Related News

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

Big Stories

×