World Club Championship : వివిధ దేశాల్లోని ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్ లో గెలిచిన జట్లతో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్ జరుగనున్నట్టు సమాచారం. దీనికి ఐసీసీ చైర్మన్ జైషా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో రిచర్డ్ అనుకూలంగా ఉన్నట్టు క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఇక ఇందులో అన్ని దేశాల లీగ్ ల నుంచి టాప్ 2 టీమ్స్ పాల్గొంటాయి. ఐపీఎల్ టాప్ 3, ఆస్ట్రేలియన్ బిగ్ బాస్ టాప్ 2, సౌతాఫ్రికా SAT20 లో టాప్ 2 టీమ్స్, ఇంగ్లాండ్ 100 లీగ్ లో టాప్ 2 టీమ్స్ అలా అన్ని మేజర్ లీగ్ నుంచి పాల్గొంటాయి. గతంలో ఇలాగే ఛాంపియన్ లీగ్ జరిగింది. 2009 నుంచి 2014 వరకు కొనసాగింది. 2008న ఛాంపియన్ ప్రారంభిచగా.. అప్పుడు ముంబై లో పేలుళ్ల కారణంగా వాయిదా పడింది.
Also Read: Natasa Stankovic : బాక్సింగ్ లోకి ఎంట్రీ ఇస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ భార్య
WCC లో IPL, PSL ఛాంపియన్లు..
వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్ కనుక అమలులోకి వస్తే.. ఐపీఎల్, పీఎస్ఎల్, ది హండ్రెడ్, బిగ్ బాష్ తదితర లీగ్స్ ఛాంపియన్ టీమ్స్ ఒకే టోర్నీలో తలపడే అవకాశముంది. 2014లో ఛాంపియన్స్ లీగ్ విజేత గా చెన్నై సూపర్ కింగ్స్ నిలవడం విశేషం. ఛాంపియన్ లీగ్ T20 ప్రారంభ ఎడిషన్ 2009లో జరిగింది. 2014 వరకు ప్రతీ ఏడాది నిర్వహించారు. వీక్షకుల కొరత, స్పాన్సర్ షిప్ సమస్యల కారణంగా టోర్నమెంట్ 2015 నిలిపివేయబడింది. కేవలం నాలుగు లీగ్‌ల జట్లు మాత్రమే పాల్గొనేవి. IPL అత్యధిక స్లాట్‌లను పొందింది-మూడు. CSK- MI ప్రతి రెండు విజయాలతో అత్యంత విజయవంతమైన జట్లు. ఇప్పుడు పునరుజ్జీవనానికి సమయం ఆసన్నమైంది.
ఛాంపియన్స్ లీగ్ స్థానంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్..
ఎందుకంటే ప్రతి దేశంలోనూ T20 లీగ్‌లు ఉన్నాయి. కొత్త టోర్నమెంట్‌లో మరిన్ని జట్లు పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఇక ఇది ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్‌కు క్రికెట్ సమాధానంగా మారవచ్చు. వాస్తవాని ఈ లీగ్ 2008లో ప్రారంభమైనప్పటికీ ముంబై లో దాడుల కారణంగా రద్దు చేయబడింది. 2009లో న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ టీమ్ విజయం సాధించింది. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఛాంపియన్ లీగ్ T20 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. 2012లో సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించగా.. ఇక 2010లో కోల్ కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ లీగ్ లో అత్యధికంగా ముంబై ఇండియన్స్ 2, చెన్నై సూపర్ కింగ్స్ 2 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు ఇండియా టీమ్ లు కావడం విశేషం. 2026 లో ఛాంపియన్స్ లీగ్ స్థానంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్ గా మార్చాలని. అందులో గత టీమ్ లతో పీఎస్ఎల్ టీమ్ లను కూడా తీసుకొని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.