Zombie Horror Thriller: సరస్సు దగ్గర దొరికే డబ్బు బ్యాగ్… దాన్ని తీసుకున్న తర్వాత అతని జీవితంలో ఊహించని మార్పులు… కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే… ఆ డబ్బు వెనుక ఉన్న రహస్యం అతన్ని ఏకంగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడ మనుషులు కనిపించరు. చుట్టూ జాంబీలు మాత్రమే. ఒకవైపు గతంలో చేసిన తప్పు అతన్ని వెంటాడుతుంటే, మరోవైపు జాంబీలతో నిండిన ప్రపంచంలో ఓ కుటుంబాన్ని కాపాడాల్సిన పరిస్థితి. రెండు ప్రపంచాలను కలిపి నడిపించే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ‘నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ డ్యూయల్’ (Not All Movies Are The Same Dual). మరి ఆ డబ్బు బ్యాగ్ వెనుక ఉన్న అసలు కథేంటి ? అతను జాంబీ ప్రపంచంలోకి ఎలా వెళ్లాడు? అక్కడ చిక్కుకున్న కుటుంబాన్ని ఎలా కాపాడాడు? ఈ సినిమా తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం.
ఓ మారుమూల సరస్సు దగ్గర ఓ మత్స్యకారుడికి అనుకోకుండా డబ్బుతో నిండిన బ్యాగ్ దొరుకుతుంది. అదృష్టంగా భావించిన ఆ డబ్బే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బ్యాగ్ దొరికిన తర్వాత వరుసగా వింత పరిణామాలు మొదలవుతాయి. అసలు ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చింది? దాని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలే కథలో అసలైన సస్పెన్స్. అయితే అసలు ట్విస్ట్ అక్కడితో ఆగదు. తన జీవితంలో జరిగిన ఓ విషాదకరమైన తప్పిదం కారణంగా ఓ యువకుడు తీవ్ర నిరాశలో ఉంటాడు.
అదే సమయంలో అతని ముందుకు అనుకోకుండా ఓ ప్యారలల్ వరల్డ్‌కు వెళ్లే మార్గం వస్తుంది. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అతనికి కనిపించే దృశ్యాలు షాక్‌కు గురిచేస్తాయి. మనుషులు కనిపించరు. ఎటు చూసినా జాంబీలే. అక్కడ ఓ కుటుంబం జాంబీల మధ్య చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతుంటుంది. తన గతం నుంచి తప్పించుకోవాలని చూస్తున్న యువకుడికి, ఇప్పుడు మరో ప్రపంచంలోని ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత తలపై పడుతుంది. ఇక్కడే ‘డ్యూయల్’ అనే టైటిల్‌కు అసలు అర్థం కనిపిస్తుంది. ఒక ప్రపంచంలో అతని గతం వెంటాడుతుంటే… మరో ప్రపంచంలో జాంబీలతో పోరాడాల్సి వస్తుంది. రెండు ప్రపంచాల మధ్య ప్రయాణిస్తూ కుటుంబాన్ని కాపాడేందుకు అతను చేసే ప్రయత్నం ప్రతి క్షణం ప్రమాదకరంగా మారుతుంది.
అసలు ఈ రెండు ప్రపంచాల మధ్య సంబంధం ఏంటి ? సరస్సు దగ్గర దొరికిన డబ్బు బ్యాగ్ కు జాంబీ ప్రపంచానికి ఉన్న లింక్ ఏంటి ? అతని గతంలో జరిగిన తప్పుకు ఈ మరో ప్రపంచంతో సంబంధం ఉందా ? జాంబీల మధ్య చిక్కుకున్న కుటుంబాన్ని అతను కాపాడగలిగాడా ? చివరికి రెండు ప్రపంచాల్లో ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలైన థ్రిల్.
‘నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ డ్యూయల్’కు సురేష్ సాగిరాజు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. రోష్ని అరవిందాక్షన్, రఘు వర్ధన్ కల్లెం, కుషి పిల్లాల, రెక్సన్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుమారు 1 గంట 35 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను కలిపి తెరకెక్కించారు. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. ప్రస్తుతం Lionsgate Playలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Amazon Prime Videలో కూడా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆడియోలు కూడా అందుబాటులో ఉంది. డబ్బు బ్యాగ్‌తో మొదలై ప్యారలల్ వరల్డ్, జాంబీ సర్వైవల్, మిస్టరీ, ఎమోషన్ వరకు వెళ్లే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు మంచి ఫీస్ట్ అవుతుంది.
Read Also: చచ్చిపోయిన ప్రేమ మళ్లీ తిరిగొస్తే… ఈ లవ్ స్టోరీలో చివరి 20 నిమిషాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది మావా