Indian Railways Rules: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా జర్నీ ఎంజాయ్ చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణీకుల నిద్రకు ఇబ్బంది కలగకుండా కీలక చర్యలు చేపట్టింది. రాత్రిపూట టీటీఈలు టికెట్ల చెకింగ్ కు వచ్చి నిద్రకు భంగం కలిగిస్తున్నారని పలువురు ప్రయాణీకులు భారతీయ రైల్వేకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇకపై అలా జరగకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేసింది.
రాత్రిపూట తనికీ నిషేధమే, కానీ..
TTE రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య స్లీపర్, AC కోచ్ లలో టికెట్లను తనిఖీ చేయకుండా రైల్వే మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ నిర్ణయం కారణంగా ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోయే అవకాశం ఉంటుంది. అయితే, రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా ప్రయాణీకుడు రైలు ఎక్కితే, టికెట్ తనిఖీ చేసే అధికారంTTEకి ఉంటుంది. అయితే, ఇప్పటికే రైల్లో ఉన్న ప్రయాణీకులను చెక్ చేయడానికి అనుమతి లేదు.
TTEపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందా?
TTE రాత్రి 10 గంటల తర్వాత కూడా టికెట్లను చెక్ చేయడానికి వస్తే, నిద్రపోతున్న వారికి ఇబ్బంది కలిగిస్తే 139లో రైల్వే హెల్ప్ డెస్క్ కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ హెల్ప్ లైన్ 24/7 పని చేస్తుంది. మీ సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి భారతీయ రైల్వే ఈ నిబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులకు నిబంధనల గురించి తెలియకపోవడంతో ఫిర్యాదులు చేయరు. ఇకపై మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే కచ్చితంగా ఫిర్యాదు చెయ్యొచ్చు.
Read Also: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి పంబన్ బ్రిడ్జి పరిస్థితి ఇది, రైలు సేవలన్నీ బంద్!
రాత్రిపూట అదనపు చర్యలు
రాత్రిపూట ప్రయాణీకులు ప్రశాంతంగా జర్నీ చేసేందుకు భారతీయ రైల్వే పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాత్రి పది గంటల తర్వాత, కోచ్ మెయిన్ లైట్లు ఆఫ్ చేయబడుతాయి. హెడ్ ఫోన్స్ లేకుండా, వీడియోలు ప్లే చేయడం, మ్యూజిక్ వినడం నిషేధం. రాత్రి పూట గట్టి మాట్లాడడం, అవరవడం చేయకూడదు. రైళ్లలో మద్యం సేవించడానికి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా మద్యం సేవించి పెద్ద పెద్దగా అరిచినా, తోటి ప్రయాణీకులతో దురుసుగా ప్రవర్తించినా రైల్వే అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. 139కి కాల్ చేయడం ద్వారా లేదంటే రైల్ మదద్ యాప్ నుంచి ఫిర్యాదు చేయడం ద్వారా వారి న్యూసెన్స్ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
Read Also: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?