Nara Lokesh -JNR Season 2: టాలీవుడ్ హీరో జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. సెలబ్రిటీ టాక్ షో గా మంచి ఆదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు రెండవ సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ రెండవ సీజన్లో భాగంగా ఇప్పటికే సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొన్నారు.
దీపావళి పండుగ సందర్భంగా ఈ పూర్తి ఎపిసోడ్ జీ 5 లో ప్రసారం కాబోతోంది .ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా నారా లోకేష్ ఎన్నికలలో విజయం గురించి చంద్రబాబునాయుడు అరెస్ట్ (Chandrababu Naidu Arrest)కావడం గురించి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏ ధైర్యంతో ఎప్పుడు గెలవని మంగళగిరి నుంచి పోటీ చేసావంటూ ప్రశ్నించడంతో ఓడిపోయావ్ అంటూ కామెంట్లు చేయడంతోనే అని లోకేష్ సమాధానం ఇచ్చారు. ఏపీ రాజకీయ చరిత్రలోనే తాను అత్యధిక మెజారిటీతో గెలుపొందిన 3 వ అభ్యర్థి అని లోకేష్ తెలిపారు.
ఏ పనిలోనైనా కమిట్మెంట్ లేకపోతే గెలవలేము అంటూ లోకేష్ మాట్లాడటంతో కమిట్మెంట్ తో పాటు కరేజ్ కూడా ఉండాలని తెలిపారు. వెంటనే లోకేష్ అన్ని మేనమామ పోలికలే అంటూ చమత్కరించారు. 35 ఏళ్ల తర్వాత మంగళగిరిలో నువ్వు గెలవడం అనేది పార్టీ నీకిచ్చిన విజయం కాదు నువ్వే పార్టీకి ఇచ్చిన విజయం అంటూ జగపతిబాబు ఎలివేషన్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి జగపతిబాబు మాట్లాడటంతో వెంటనే లోకేష్ మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాధ అవుతుందని తెలిపారు..
?srtk=Mm82dnNnNDcwbzhz
నాన్న అరెస్ట్ అవడం అనేది ఎవరు ఊహించలేదు. తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూడాలని ఎవరు అనుకోరు చాలా బాధ కలిగింది. నాన్న అరెస్టు అయినప్పుడు మాకు ఒకటే మాట చెప్పారు దేవాన్ష్ ను ఇక్కడికి తీసుకురావద్దని చెప్పారు. అప్పుడు ఎవరైతే బాబు గారిని జైల్లో పెట్టారో ఇప్పుడు వారందరూ అదే జైల్లో ఉన్నారని లోకేష్ తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఫోటోని చూపించడంతో రాజకీయాలలోనే ఇదొక ఐకానిక్ ఫోటో అంటూ జగపతిబాబు మాట్లాడటంతో వెంటనే లోకేష్ కష్టకాలంలో ఎవరు మనతో నిలబడ్డారు అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ ఒక అన్నలాగ భావిస్తానంటూ లోకేష్ చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ పూర్తి ఎపిసోడ్ లో భాగంగా ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారు అనేది తెలియాలి అంటే నవంబర్ 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: జబర్దస్త్ వర్ష సీరియల్స్ మానేయడానికి ఇదే కారణమా? ఇన్నాళ్లకు బయటపడిందిగా?