E-Paper
Advertisement

Niharika Konidela: రామ్ చరణ్ కోసం కథను సిద్ధం చేసిన నిహారిక.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యమా!

Niharika Konidela: రామ్ చరణ్ కోసం కథను సిద్ధం చేసిన నిహారిక.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యమా!
Advertisement

Niharika Konidela: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. కెరీర్ మొదట్లో యాంకర్ గా కొనసాగిన ఈమె అనంతరం నటిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు  ఇక హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అందుకొని నేపథ్యంలో నిహారిక నిర్మాతగా మారి ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే నిహారిక నిర్మాణంలో రాకాసా(Raakaasaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతోంది.

చరణ్ తో నిహారిక సినిమా..

ఈ నేపథ్యంలోనే నిహారిక వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు తన ఇంట్లో హీరోల సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీకు కనుక మీ నిర్మాణంలో మెగా హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వస్తే మీరు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ ఈ ముగ్గురిలో ఎవరితో సినిమా చేస్తారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ తాను చరణ్(Charan) అన్నతోనే సినిమా చేస్తానని సమాధానం ఇచ్చారు.

చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యమా..

Advertisement

ఇక చరణ్ గారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారనే ప్రశ్న ఎదురవగా తాను ఒక రంగస్థలం, ధృవ లాంటి కాప్ పాత్రలతో ఉండే సినిమా చేస్తాను అంటూ నిహారిక ఈ సందర్భంగా రామ్ చరణ్ తో ఏ జానర్ లో సినిమా చేయాలనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో నిహారిక చరణ్ తో ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారనే విషయంపై ఫుల్ క్లారిటీతో ఉన్నారని ఇక చరణ్ నుంచి నిహారికతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్…

Advertisement

ఇక నిహారిక ఇదివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నిహారిక ఇప్పుడు రాకాసా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ఈ సినిమాలో హీరో హీరో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా హర్రర్ ఫాంటసీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి ఏప్రిల్ మూడో తేదీ రాబోతున్న ఈ సినిమా నిహారికకు ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Allu Arjun -Atlee: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో స్టార్ క్రికెటర్ వైఫ్.. థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×